భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండాలంటే వీటిని వదిలెయ్యండి!!

ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఎందుకు వస్తాయి? ఎందుకు విడాకుల కోసం భార్య భర్తలు వెళుతున్నారు? విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య ఎందుకు విపరీతంగా పెరుగుతుంది? వంటి అనేక ప్రశ్నలకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.

భార్య భర్తల మధ్య గొడవలు కారణాలేమిటి ? ఎందుకు భార్య భర్తల బంధంలో బీటలు వారుతున్నాయి అంటే అనవసరమైన ఇగోల వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. అహంకారం భార్యాభర్తల మధ్య బంధానికి బీటలు వారేలా చేస్తుంది. నీ కంటే నేనే ఎక్కువ? నీ కంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను? నీ కంటే నేను ఎక్కువ చదువుకున్నాను? వంటి అనేక అర్థంపర్థం లేని ఇగోలు సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి.

 happycouple

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి మరో ముఖ్యమైన కారణం ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం. ప్రతి చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల మధ్య రాద్ధాంతం జరిగితే కూడా వారి మధ్య బంధం బలహీనపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేలా ఆలోచించరు. కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఇద్దరిలోనూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని సర్దుకోవాలి. చిన్న కారణాలతో భూతద్దంలో చూసి తరచూ గొడవలకు దిగుతుంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడతాయి.

ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు మరో ముఖ్యమైన కారణం ఒకరినొకరు విమర్శించుకోవడం. ఒకరికొకరు గౌరవించుకోకపోవటం. తరచూ భార్యాభర్తలు ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల వారి మధ్య ఇగోలు పెరిగి సంబంధం బలహీనపడుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధం బీటలు వారడానికి మరో ముఖ్యమైన కారణం విపరీతంగా పెంచుకున్న అంచనాలు. భర్త గురించి భార్య, భార్య గురించి భర్త విపరీతమైన అంచనాలను ఏర్పరచుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆ అంచనాలను చేరుకోలేక పోయినప్పుడు అది అసహనంగా మారి ఇరువురి మధ్య గొడవకు కారణం అవుతుంది. ఒకరిపై ఒకరు విపరీతమైన అంచనాలు పెట్టుకోవడం మానేయండి. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవడానికి ముఖ్యమైన కారణం తప్పు నన్ను క్షమించు లేకపోవడం. భార్య తప్పు చేస్తే భర్త, భర్త తప్పు చేస్తే భార్య క్షమించి దిద్దు కోవాలి. కానీ అటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడి వారి దాంపత్య జీవితం మధ్యలోనే ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+