అందాల ఐశ్వర్యారాయ్‌కి ఆడపిల్లే పుడుతుందట. ఆ పాప కూడా అచ్చం అమ్మలాగే ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. తన అందాలతో ప్రపంచాన్ని ముగ్ధులను చేయడానికి ఆ పాప భూమి మీదికి వస్తుందన్న మాట. తాను తాతను కాబోతున్నట్లు బిగ్ బి అమితాబ్ లోకానికి తెలియజేసినప్పటి నుంచి ఐష్‌కు పుట్టబోయే బిడ్డ గురించి జ్యోతిష్కులు అంచనాలు వేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ 2011 తల్లి కాబోతోందని తాను 2010 నవంబర్‌లోనే చెప్పానని ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త భావిక్ సంఘ్వీ చంకలు గుద్దుకుంటున్నారు.
ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్‌ల పాలక సంఖ్య ఐదు అని, అందువల్ల తప్పకుండా వారికి అడపిల్లే పుడుతుందని అంటున్నారు. రెండు పాలక సంఖ్యలు ఐదు కావడం వల్ల కవలలు కూడా పుట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐష్‌కు పుట్టబోయే ఆడపిల్ల ఐష్‌లాగే ఉన్నా పొడవును మాత్రం తండ్రి నుంచి అరువు తెచ్చుకుంటుందట.