క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో నిండా మునిగిపోయిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ప్రేయసి టోకరా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ కప్ పోటీల్లో భజ్జీ తన సత్తా చాటలేకపోయాడు. హర్భజన్ సింగ్‌తో బాలీవుడ్ నటి గీతా బస్రా తెగదెంపులు చేసుకున్నట్లేనని ప్రచారం జరుగుతోంది. కమిట్‌మెంట్ ఇష్యూయే వారిద్దరినీ విడిదీసినట్లు చెబుతున్నారు. పూర్తిగా క్రికెట్ క్రీడకు అంకితమైన హర్భజన్ సింగ్ మరో రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేడట. గీతా బస్రా మాత్రం పెళ్లి కావల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమచారాం.
భిన్నమైన లక్ష్యాల వల్ల తమకిద్దరికి పొసగదని వారు నిర్ణయించుకున్నారట. తమ మధ్య అఫైర్ గురించి వారు ఏనాడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ, ఇద్దరూ కలిసి తిరుగుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఏడాది క్రితం కూడా భజ్జీ తన ప్రియురాలితో ఇలాగే విడిపోయాడు. మళ్లీ ఇద్దరూ కలిశారు. భూమి గుండ్రంగా ఉన్నట్లు వారిద్దరు తిరిగి కలుస్తారా అంటే, ఏదైనా సాధ్యమేనని చెప్పవచ్చు.
Buzz is that actress Geeta Basra and cricketer Harbhajan Singh have called it quits. Apparently, commitment issues drove them apart. Bhaji is totally dedicated to his game at the moment, and doesn't want to be tied down for another 2-3 years, Geeta wanted a commitment from him.
Story first published: Tuesday, March 22, 2011, 8:42 [IST]