హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రణబ్‌కు గురిపెట్టిన సాయికుమార్: టివిఛానెల్‌కూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణం కేసు ఇటీవల రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి సాయి కుమార్ బుట్టలో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా పడ్డారు. గంగూలీని చూపించి పలువురి నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడట! సాయికుమార్ చేపట్టిన వన్ కార్డ్ వన్ నేషన్ పథకానికి గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

గంగూలీని ఉపయోగించుకొని సాయికుమార్ భారీగా డబ్బులు వసూలు చేశాడట. అందుకే ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నాడు. అయితే ఇదే వన్ కార్డ్ వన్ నేషన్ పథకం కోసం ఆయన గంగూలీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా గురి పెట్టారట. ఈ పథకంతో ఏకంగా జాతీయస్థాయిలో వెలిగిపోదామని అతను భావించాడు. కంపెనీ రిజిస్టర్ చేయించకుండానే ప్రచార కార్యకలాపాలు ప్రారంభించి రూ.500 కోట్లు జేబులో వేసుకుందామని భావించాడట.

వన్ కార్డ్ వన్ నేషన్ పథకం ప్రచారానికి మరింత ఊపు తెచ్చేందుకు సాయికుమార్ ప్రణబ్ ముఖర్జీ అపాయింటుమెంటు కూడా కోరుదామని భావించారట. ప్రణబ్ ముఖర్జీకీ నవంబర్‌లో తొలి కార్డ్ ఇవ్వడం ద్వారా దీనికి మరింత ప్రచారం తేవాలని భావించాడట. ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు చెప్పారని తెలుస్తోంది. అన్నీ సాయికుమార్ తన మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రపతి భవన్ నుంచి అపాయింటుమెంట్ కోరేవాడని సమాచారం.

ఇందుకోసం ఇప్పటికే ప్రణబ్ బంధువులను ఇప్పటికే సంప్రదించారని తెలుస్తోంది. వారి ద్వారా ప్రణబ్‌ను కలిసి తన పథకానికి మంచి హైప్ తీసుకు రావాలనేది సాయికుమార్ మాస్టర్ ప్లాన్ అట. కానీ అది ఇప్పుడు ఎదురు తిరిగింది. సాయికుమార్ ఓ టీవి ఛానల్ ఏర్పాటుకు కూడా ప్రయత్నించాడని సమాచారం. కాగా శనివారం రాత్రి నుండి వన్ ఇండియా వన్ కార్డ్ వెబ్ సైట్ ఆగిపోయింది. దీంతో ఫ్రాంచైజీలు తీసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు.

English summary

 It is said that, Arrested in AP minority finance corporation scam case, Sai Kumar has planned to try president Pranab Mukherjee's appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X