వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు, కిరణ్ బ్లెస్సింగ్స్: కన్నా కొత్త ఎపి పిసిసి చీఫ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanna Laxmi Narayana
వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అందుకోసం ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెసు పార్టీ తెలంగాణ కోసం చకచకా పావులు కదుపుతోంది. ఐదారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(కొత్తది)లుగా ఏర్పడనున్నాయి. ఆ దిశగా కేంద్రం కూడా పావులు కదుపుతోంది.

ఈ నేపథ్యంలో పదమూడు జిల్లాలతో ఏర్పడబోయే కొత్త ఆంధ్రప్రదేశ్‌లో పిసిసి పదవి చేపట్టేందుకు కన్నా ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ రేసులో అధిష్టానం దృష్టిలో కూడా ఆయన ముందే ఉన్నారు. అందులో భాగంగానే సమైక్య ఉద్యమంలో వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారని అంటున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కన్నా మాత్రం వ్యూహాత్మక మౌనంతో అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారట.

విభజన నిర్ణయానికి ముందు చాలాకాలం నుండే సమైక్య రాష్ట్రానికి కన్నా లక్ష్మీ నారాయణ పిసిసి బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుత పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ స్థానంలో కన్నాకు అవకాశం లభించవచ్చునని పుకార్లు వినిపించాయి.

ఇప్పుడు కొత్త రాష్ట్రంలో మాత్రం ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు. కన్నా తన రాజకీయ గురువు కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో ఆ పదవి చేపట్టే అవకాశాలున్నాయంటున్నారు.

English summary
Minister for agriculture Kanna Laxmi Narayana is reportedly eyeing the PCC president's post in the new state that would be formed with 13 districts, if Telangana is separated from AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X