వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేణుకా చౌదరి కత్తికి రెండు వైపులా పదును?

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Chowdary
న్యూఢిల్లీ: కాంగ్రెసు సీనియర్ నేత రేణుకా చౌదరిది సీమాంధ్రనా, తెలంగాణనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పుట్టుకను బట్టి సీమాంధ్ర అని చెప్పినా, రాజకీయ జీవితాన్ని బట్టి చూస్తే తెలంగాణ అని చెప్పవచ్చు. తాను తెలంగాణ బిడ్డను అని ఆమె పలుమార్లు గొంతెత్తి చెప్పుకున్నారు. ఆమె మాటను తెలంగాణవాళ్లు కూడా ఎప్పుడూ కాదనలేదు. కానీ, ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మాత్రం తెలంగాణ నాయకుల నుంచి అప్పుడప్పుడు వినిపించాయి. తాను ఖమ్మం జిల్లాకు చెందిన బిడ్డను అని చెబుకుంటారు.

అయితే, రేణుకా చౌదరి రెండు వైపులా ఉండడానికి నిర్ణయించుకున్నారని గిట్టనివారు ఆమెపై వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలోని విభేదాలను రూపుమాపి, ఇరు ప్రాంతాల వారిని అభిప్రాయాలను వినడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎకె ఆంటోనీ కమిటీని వేశారు. ఆంటోనీ కమిటీకి ఎవరి అభిప్రాయాలు వారు చెబుకునే అవకాశం ఉంది.

బుధవారం రాత్రి తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. వీరితో రేణుకా చౌదరి ఎప్పుడూ కనిపించలేదు. కానీ, ఆంటోనీ కమిటీ ముందుకు ఆమె విడిగా ఆ రోజు వచ్చేశారు. దీన్నిబట్టి ఆమెను తెలంగాణవాదిగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆమె దానితో సరిపుచ్చకుండా, గురువారం రాత్రి ఆంటోనీ కమిటీతో సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యుల సమావేశానికి కూడా ఆమె నేనున్నాఅంటూ వచ్చేశారు.

రేణుకా చౌదరి తీరును ఎవరే విధంగా తప్పు పట్టినా, సమర్థించినా ఆమె ఎఐసిసి అధికార ప్రతినిధి అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఎఐసిసి ప్రతినిధిగా రెండు ప్రాంతాలకు ఆమె ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. విషయాలను పార్టీపరంగా చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా, రేణుకా చౌదరి కత్తికి రెండు వైపులా పదును ఉందని మాత్రం అందరికీ తెలుసు.

English summary
Congress MP Renuka Chowdhary is owning Seemandhra and Telangana at a juncture of bifurcation of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X