అవమానించడమే: ‘పప్పు’పై ఎన్నికల సంఘం నిషేధం

Subscribe to Oneindia Telugu
Guj EC Bans Use Of Pappu In BJP Ad ‘పప్పు’పై ఎన్నికల సంఘం నిషేధం

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రత్యర్థి పార్టీలు విమర్శించిన సమయంలో 'పప్పు' అనే పదం వాడటం వారికి పరిపాటిగా మారింది. అయితే, తాజాగా, రాహుల్‌ను ఉద్దేశించి ప్రచార కార్యక్రమాల్లో 'పప్పు' అనే పదాన్ని వినియోగించడాన్ని గుజరాత్‌ ఎన్నికల కమిషన్‌ నిషేధించింది.

ఈసీకి స్క్రిప్టు..

ఈసీకి స్క్రిప్టు..

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సందర్భంగా ఓ ఎలక్ట్రానిక్‌ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాహుల్‌ను ఉద్దేశించి 'పప్పు' పదాన్ని వినియోగించడానికి ఈసీకి స్క్రిప్టును పంపింది.

ఓపీనియన్ పోల్: గుజరాత్‌లో ఏకపక్షమే, మళ్లీ బీజేపీనే

అవమానించడమే..

అవమానించడమే..

స్క్రిప్టును పరిశీలించిన కమిషన్‌కు చెందిన కమిటీ ‘పప్పు' అనే పిలుపు అభ్యంతకరంగా ఉందని చెప్పింది. ఓ నాయకుడిని అలా పిలవడం ఆయన్ను అవమానించడమేనని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.

ఉద్దేశించి చేసింది కాదు..

ఉద్దేశించి చేసింది కాదు..

ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై స్పందించిన గుజరాత్‌ బీజేపీ శ్రేణులు అడ్వర్టైస్‌మెంట్‌లో వినియోగించిన స్క్రిప్ట్‌ ఏ నాయకుడిని ఉద్దేశించి కాదని పేర్కొన్నాయి.

సరికొత్త స్క్రిప్టుతో..

సరికొత్త స్క్రిప్టుతో..


ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన స్క్రిప్టును ముందుగానే గుజరాత్‌ ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉండే మీడియా కమిటీకి అందజేస్తామని తెలిపాయి. అలా స్క్రిప్టును పరిశీలించిన కమిటీ సభ్యులు ‘పప్పు' అనే పదాన్ని తొలగించాలని కోరినట్లు వెల్లడించాయి. పప్పు అనే పదాన్ని రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నట్లు ఈసీ భావించిందని తెలిపాయి. త్వరలోనే సరికొత్త స్క్రిప్టును ఈసీకి అందజేస్తామని తెలిపాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Election Commission has barred the ruling BJP in Gujarat from using the word "Pappu" in an electronic advertisement, which apparently targeted Congress vice president Rahul Gandhi, calling it "derogatory".
Please Wait while comments are loading...