విషాదం: పదికిలోమీటర్ల పాటు కూతురు మృతదేహంతో తల్లి కాలినకడకన స్వగ్రామానికి

Posted By:
Subscribe to Oneindia Telugu

గూడెం కొత్తవీధి:అడిగినంత సొమ్ము ఇవ్వలేదనే కారణంతో మృతదేహన్ని మద్యలోనే దించేశాడు ఓ ఆటోడ్రైవర్. అయితే తన కూతురు మృతదేహన్ని పది కిలోమీటర్ల పాటు భుజంపై మోసుకెళ్ళింది ఓ తల్లి. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకొంది.

విశాఖ జిల్లా గూడెం కొత్త వీధి మండలం చీపురుగొంది గ్రామానికి చెందిన వంతుల రామయ్య తన కుమార్తె సంగీతను చింతాడ ప్రాథమికొన్నత పాఠశాలలో చేర్పించాడు. బంధువుల ఇంట్లో ఉంచి తన కూతురును చదివించేవాడు.ఆమెకు శుక్రవారం నాడు కడుపునొప్పి రావడంతో బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపుగాను ఆమె మరణించింది.

tribal family 10 km walk daughter's deadbody in visakapatnam district

కుమార్తె మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకుగాను రూ.2500 ఇచ్చి ఆటో మాట్లాడుకొన్నారు. చింతాడ నుండి జికె వీధి వరకు తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ ఇంటివరకు తీసుకెళ్ళాలంటే మరికొంద సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని తల్లిదండ్రులు చెప్పడంతో వారిని అక్కడే దించేశాడు.

పదహరు కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్ళిన ఆటోడ్రైవర్ చివరకు అదనపు సొమ్ము కోసం డిమాండ్ చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు ఈ విషయంలో చేసేది లేక ఆటో దిగిపోయారు.

దీంతో కుమార్తై మృతదేహన్ని తీసుకొని బాదిత కుటుంబసభ్యులు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి భుజంపై మోసుకెళ్ళారు. ఈ ఘటన పలువురిని కదిలించివేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
tribal family 10 km walk daughter's deadbody in visakapatnam district.vanthula ramaiah's daughter sangeeta studying in chintada upper primary school.she has got severe stomach pain.she died at hospital on friday.auto driver demanded they extra money for shifting sangeeta's dead body. ramaiah wife 10 km walk daughter's deadbody.
Please Wait while comments are loading...