టీడీపీ ఇరుక్కుందా?: గంటా లేఖ వెనుక ఉన్నది బాబేనా?.. అసలేం జరుగుతోంది!

Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖ భూదందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ ఓ కొత్త నాటకానికి తెరలేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దందా అంశాన్ని తెర మీద లేకుండా చేయడానికి.. మంత్రుల మధ్య తగాదాకు బీజం వేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయ్యన్న ఇలాగేవుంటే..: గంటా హెచ్చరిక, బాబుకు వివరంగా చెప్పారు

ఇందులో భాగంగానే మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినట్లు చెబుతున్నారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడి తీరుపై పలు ఆరోపణలు చేస్తూ ఆయన సీఎంకు లేఖ రాశారు. అయ్యన్న వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని.. మొత్తంగా ఆయన్ను కట్టడి చేయాల్సిన అవసరముందనేది లేఖలో గంటా వాదన.

అయ్యన్న ఏమన్నారు?:

అయ్యన్న ఏమన్నారు?:

విశాఖ భూదందాలో స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారని మంత్రి అయ్యన్న బహిరంగంగానే ఆరోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని కూడా చెప్పారు. ప్రజాప్రతినిధుల హస్తముందంటూ అయ్యన్న చేసిన ఆరోపణలు మంత్రి గంటాను ఉలిక్కిపడేలా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలోను గంటాపై భూ ఆక్రమణల ఆరోపణలు ఉండటంతో.. ఆయన త్వరగా అప్రమత్తమైనట్లు చెబుతున్నారు.

చంద్రబాబే లేఖ రాయించారా?:

చంద్రబాబే లేఖ రాయించారా?:

ఓవైపు సొంతగూటి నుంచే ఆరోపణలు.. మరోవైపు సామాన్యులు, ప్రతిపక్షం నుంచి కూడా విశాఖ భూదందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎటు తిరిగి ఈ వ్యవహారం అధికార పార్టీ మెడకు చుట్టుకుందన్న సందేహాం టీడీపీ అధిష్టానానికి కలిగినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలను నేరుగా తిప్పి కొట్టలేక.. మంత్రుల మధ్య తగాదాగా ఈ వ్యవహారాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే మంత్రి గంటాతో సీఎం చంద్రబాబే స్వయంగా లేఖ రాయించి ఈ డ్రామాకు తెరలేపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యను పార్టీలోని వ్యక్తుల మధ్య తగాదాగా చిత్రీకరిస్తే.. మీడియా అంతా వీరి పైనే ఫోకస్ చేస్తుందన్న ప్లాన్ ఇందులో ఉన్నట్లుగా అర్థమవుతోంది.

ఇరుకునపడ్డ టీడీపీ:

ఇరుకునపడ్డ టీడీపీ:

వైసీపీ నేతలంతా తొలినుంచి ఈ వ్యవహారమంతా మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే జరుగుతోందని, కాబట్టే ప్రభుత్వం ఈ విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మంత్రి గంటా సహా ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ, తదితరులు ఈ భూ కబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ప్రతిపక్షం వైసీపీకి ఈ విషయం ఓ అస్త్రంగా మారడంతో.. టీడీపీ కాస్త ఇరుకునపడినట్లుగానే కనిపిస్తోంది. అదీ గాక మంత్రులే ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదిగా మారింది. విశాఖ భూ కబ్జాపై తొలి నుంచి ప్రభుత్వ నియంత్రణ లేకపోయినందువల్లే భూ బకాసురులు ఇంతగా రెచ్చిపోయారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది.

గంటా.. ఇన్నాళ్ల మౌనం తర్వాత!:

గంటా.. ఇన్నాళ్ల మౌనం తర్వాత!:

మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేసి వారం రోజులు గడిచిపోయాక మరో మంత్రి గంటా దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. అటు రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ భూ కబ్జాలపై ప్రకటనలు చేస్తుంటే.. ఇన్నాళ్లు దానిపై నోరు మెదపని గంటా.. ఇప్పుడు సీఎంకు లేఖ రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ భూఆక్రమణల వ్యవహారంలో సీఎం, డిప్యూటీ సీఎంల వైఖరి కూడా భిన్నంగా ఉంది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పగా..సీఎం మాత్రం సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్)తో విచారణ జరిపిస్తామన్నారు. దీంతో సీబీఐ దర్యాప్తును ఎందుకు పక్కకు పెట్టారని వైసీపీ ప్రశ్నిస్తోంది. గంటా లేఖ కూడా భూ కబ్జా అంశాన్ని తెర పైనుంచి కనుమరుగు చేసేందుకేనని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
All isn't well between AP Ministers Ganta Srinivas Rao and Ayyanna Patrudu since few years. The group wars led by these two leaders has become a headache to the party leadership.
Please Wait while comments are loading...