వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగదు కొరత: నేతలు రూ.2000 నోట్లను దాస్తున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరతకు కేవలం రిజర్వ్ బ్యాంక్ నుంచి నగదు రాకపోవడం మాత్రమే కారణం కాదని, దానికి ఇతర కారణాలున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకులు, ఎటిఎంలు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తున్నప్పటికీ కొరత తీరడం లేదు.

ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్‌డిఐ) కింది బెయిల్ - ఇన్ క్లాజ్ వల్ల డిపాజిట్లు కోల్పోతామనే భయం ప్రజలకు పట్టుకుంది. ఆ భయంతోనే బ్యాంకుల్లోని డబ్బులను తీసుకుంటున్నారు.

cash crunch in Telangana and Andhra and why people are panicking

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు రూ.2000 వేల నోట్లను దాచుకుంటున్నారని బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. బ్యాంకుల వంటి సంస్థలు నష్టపోతే తీసుకునే చర్యల్లో డిపాజిటర్లు కూడా కొంత భరించాల్సి ఉంటుందనే ప్రతపాదన ఎఫ్ఆర్‌డిఐ బిల్లులో ఉండడమే ప్రజల భయాందోళనలకు కారణమని అంటున్నారు. దానిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిప్పటికీ భయాందోళనలు తొలగడం లేదు.

నగదు కొరత సంక్షోభంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసన మండలిలో వివణ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి సరిపోయినంత డబ్బు రావడం లేదని, ప్రల నుంచి బ్యాంకులకు వచ్చే డబ్బులు తగ్గిపోయాయని, పెద్ద నోట్లకు డిమాండ్ పెరిగిందని ఆయన అన్నారు

ఎటిఎంల్లో డబ్బులు ఉండడం లేదని, బ్యాంకులు నగదు ఇవ్వడం లేనదని, బ్యాంకుల నుంచి వెళ్తున్న డబ్బులు తిరిగి రావడం లేదని చెప్పారు.

English summary
Despite the huge cash inflow from the RBI , a severe crunch continues at banks and ATMs in Andhra Pradesh and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X