వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ అన్నంతపనీ చేశాడు!: ఈ సంస్థలకే ఫేక్‌న్యూస్ అవార్డ్స్, ‘అంతా చెత్తే’

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పనీ చేశాడు. గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్న 'ఫేక్‌ న్యూస్‌ అవార్డు'లను తాజాగా ట్రంప్ ప్రకటించారు. 2017 సంవత్సరానికి గానూ.. ఫేక్‌ న్యూస్‌ అవార్డ్‌ విజేత 'ది న్యూయార్క్‌ టైమ్స్‌' అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

ఈ మేరకు జీవోపీ.కామ్‌ వెబ్‌సైట్లో ఈ అవార్డుల జాబితా వివరాలను వెల్లడించారు. న్యూయార్క్‌ టైమ్స్‌తో పాటు ఏబీసీ న్యూస్‌, సీఎన్‌ఎన్‌, టైమ్‌, ది వాషింగ్టన్‌ పోస్ట్‌ కూడా ఈ అవార్డు దక్కించుకున్నట్లు చెప్పారు.

'ఈ అర్హతలుంటే చాలు అమెరికా స్వాగతిస్తుంది': తేల్చిన ట్రంప్ 'ఈ అర్హతలుంటే చాలు అమెరికా స్వాగతిస్తుంది': తేల్చిన ట్రంప్

చెత్త న్యూస్ నామ సంవత్సరం

చెత్త న్యూస్ నామ సంవత్సరం

‘2017.. ఓ నిరాధార, చెత్త న్యూస్‌ కవరేజీ, ఫేక్‌ న్యూస్‌ నామ సంవత్సరం. 90శాతం మీడియా కవరేజీ ట్రంప్‌కు వ్యతిరేకంగానే ఉందని అనేక అధ్యయనాలు తెలిపాయి' అని సదరు వెబ్‌సైట్లో పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్ లింక్‌ను ట్రంప్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

వారంటే గౌరవముంది..

వారంటే గౌరవముంది..

అయితే నిజాయతీ లేని, అత్యంత అవినీతి మీడియా కవరేజీ ఉన్నప్పటికీ.. కొందరు గొప్ప మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని.. వారిని తాను గౌరవిస్తున్నానని ట్రంప్‌ మరో ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.

ఫేక్ న్యూస్ అవార్డులు ఇలా..

ఫేక్ న్యూస్ అవార్డులు ఇలా..

ట్రంప్‌ ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా.. ఈ జాబితాలో న్యూయార్క్‌ టైమ్స్‌కు మొదటి స్థానం ఇచ్చారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో న్యూయార్క్‌ టైమ్స్‌కు చెందిన పాల్‌ క్రుగ్‌మన్‌ ‘ఆర్థిక వ్యవస్థ ఇక ఎప్పటికీ కోలుకోదు' అంటూ కథనం రాశారు. దానికి తొలి ర్యాంక్‌ ఇస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇక రెండో స్థానం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చారు. సీఎన్ఎన్‌కు మూడో ర్యాంక్‌, టైమ్‌ మ్యాగజీన్‌కు నాలుగు, ది వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఐదో స్థానం ఇచ్చారు.

తప్పుడు వార్తలూ

తప్పుడు వార్తలూ

కాగా, అధ్యక్ష ఎన్నిల సమయం నుంచే ట్రంప్‌ తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఫేక్‌ న్యూస్‌ అనే పదం ఉపయోగించారాయన. ఫాక్స్‌ న్యూస్‌ మినహా మిగతా మీడియాపై ట్రంప్‌ విమర్శలు చేస్తూనే ఉన్నారు. కావాలనే ఆ మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నట్లు ఆరోపించారు కూడా. అందుకే అలాంటి మీడియాకు ఫేక్‌ న్యూస్‌ అవార్డులు ఇస్తానని గత నవంబర్‌లోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అవార్డులను ప్రకటించిన ట్రంప్.. సంచలనం సృష్టించారు.

English summary
The highly anticipated fake awards announced by President Donald Trump are out. The website GOP which published the list wrote, "2017 was a year of unrelenting bias, unfair news coverage, and even downright fake news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X