రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఏమైంది: బాబు పంపలేదా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిన రేవంత్ రెడ్డి వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకపోవచ్చునని అంటున్నారు. ఆయన మంగళవారం శాసనసభ ఆవరణలో దర్శనమిచ్చారు.

  రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్ధం

  అసెంబ్లీలోకి ఆయన అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) కార్యాలయంలో ఆనయ కాంగ్రెసు శాసనసభ్యులను కలిశారు. అసెంబ్లీ నుంచి ఇద్దరు శానససభ్యులను బహిష్కరించి, 11 మందిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి జరిపిన సమాలోచనల్లో ఆయన పాలు పంచుకున్నారు.

   సాంకేతికంగా టిడిపి ఎమ్మెల్యేనే...

  సాంకేతికంగా టిడిపి ఎమ్మెల్యేనే...

  నిరుడు అక్టోబర్‌లో రేవంత్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే, సాంకేతికంగా ఆయన ఇప్పటికీ టిడిపి సభ్యుడే. ఆయన కొడంగల్ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

  ఆయన రాజీనామాపై సస్పెన్స్

  ఆయన రాజీనామాపై సస్పెన్స్

  రేవంత్ రెడ్డి శాసనసభా సభ్యత్వానికి చేసిన రాజీనామాపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆయన రాజీనామా లేఖ ఇప్పటికి కూడా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి చేరలేదు. దాంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగతూనే ఉన్నారు.

  చంద్రబాబు రాజీనామా లేఖ

  చంద్రబాబు రాజీనామా లేఖ

  పార్టీకీ శానసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలను రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అందించారు. టిడిపి నుంచి ఎన్నికయ్యాను కాబట్టి తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నట్లు సమాచారం.

  చంద్రబాబు స్పీకర్‌కు పంపించలేదా...

  చంద్రబాబు స్పీకర్‌కు పంపించలేదా...

  రేవంంత్ రెడ్డి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సమర్పించిన లేఖను చంద్రబాబు స్పీకర్‌కు పంపించలేదని సమాచారం. అయితే, దాని గురించి అడిగితే చంద్రబాబునే అడగాలని ఆయన అంటున్నారట. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  ప్రభుత్వంపై విశ్వాసం లేకనే..

  ప్రభుత్వంపై విశ్వాసం లేకనే..

  టిఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే తాను స్పీకర్‌కు రాజీనామా లేఖను సమర్పించలేదని, ఆ లేఖతో వారు ఏమైనా చేయవచ్చునని భావించి అలా చేయలేదని రేవంత్ రెడ్డి అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. టిడిపిని వీడిన రోజున్నే తాను గన్‌మెన్‌ను వెనక్కి పంపించానని, అసెంబ్లీ బ్యాంక్ ఖాతాను మూసివేశానని రేవంత్ రెడ్డి చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  According to Times of India - Revanth also made it clear that he would not participate in the Rajya Sabha elections and would not vote.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి