కాళ్ళలో నీరు.. నొక్కితే సొట్టలు పడితే ఆందోళనకరమా?

చాలామందికి కాళ్లలో నీరు వస్తుంటుంది. కాళ్లలో నీరు రావడంతో పాటు, నొక్కితే సొట్టలు పడడం, నొప్పిగా ఉండడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు కాళ్లకు నీరు రావడానికి గల కారణాలు ఏమిటి? ఇది ఆందోళన పడాల్సిన అంశమా? ఎటువంటి కారణాలతో కాళ్లకు నీరు వస్తుంది? అనే వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

కాళ్ళకు నీరు రావటానికి కారణాలు
కాళ్లకు నీరు రావడానికి అనేక సాధారణ కారణాలు, అనేక అనారోగ్య కారణాలు ఉంటాయి. సాధారణంగా ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం వలన, ఒకే స్థితిలో నిలబడడం వలన కాళ్లకు నీరు వస్తుంది. ఇక స్థూలకాయంతో బాధపడుతున్న వారికి కూడా కాళ్లకు నీరు వస్తుంది. మధుమేహంతో బాధపడే వారిలోనూ, కాళ్లల్లో రక్త ప్రసరణ సమస్యలు ఉన్న వారిలోనూ కాళ్లకు నీరు వస్తుంది.

edema with these common and medical health causes don t neglect

ఈ కారణాలతోనూ కాళ్ళకు నీరు
ఇక శరీరంలో ద్రవాలు నిలుపుదల అయినప్పుడు కూడా కాళ్లకు నీరు వస్తుంది. అధికంగా ఉప్పు తీసుకునే వారిలోనూ, తక్కువ నీరు తాగే వారిలోనూ, హార్మోన్ల మార్పుల కారణంగానూ కాళ్లకు నీరు వస్తుంది. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా కాళ్లకు నీరు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికి కాళ్లకు నీరు వచ్చే ప్రమాదం ఉంది. గుండె వైఫల్యం కారణంగా కూడా కాళ్లకు నీరు వస్తుంది.

ఈ వ్యాధులు ఉంటె కాళ్ళకు నీరు
కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో కాళ్లకు నీరు వచ్చే అవకాశం ఉంది. ఆర్థరైటిస్, అలర్జీలు వంటి సమస్యలతో బాధపడే వారిలోనూ కాళ్ళకు నీరు వస్తుంది. పోషకాహార లోపంతో బాధపడే వారిలోనూ కాళ్లకు నీరు వస్తుంది. గర్భం దాల్చిన సమయంలోను కాళ్లకు నీరు వచ్చే అవకాశం ఉంది. ఇక కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా కాళ్లకు నీరు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ చిట్కాలతో కాళ్ళకు నీరు తగ్గుతుంది
సెల్లులైటిస్, లోతైన సిరల థ్రాంబోసిస్ వంటి సమస్యలతో బాధపడే వారిలోనూ కాళ్లకు నీరు వస్తుంది. అయితే కాళ్లకు నీరు వచ్చినప్పుడు సాధారణ చిట్కాలను కొన్నింటిని పాటించి ఉపశమనం పొందవచ్చు. కాళ్ళను ఎత్తుగా పెట్టి పనిచేసుకోవడం, రోజువారి వ్యాయామం చేయడం కాళ్లకు నీరు తగ్గిస్తుంది. ఉప్పు తక్కువ తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం, బరువు తగ్గడం కూడా కాస్త ఫలితాన్ని ఇస్తుంది.

వైద్య సలహా తీసుకోవటం అవసరం
ధూమపానం మానేయడం, టైట్ గా ఉండే దుస్తులు ధరించడం మానుకోవడం కూడా కాళ్లకు నీరును తగ్గిస్తుంది. కాళ్లకు నీరు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన వైద్య సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+