మామిడికాయ చేపల పులుసు ఈజీగా ఎలా చేయాలంటే..?
తెలుగు రాష్ట్రాల్లో చేపల పులుసు వంటకాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగా చేస్తూ ఉంటారు. చేపలకూర పేరు చెబితేనే చాలామందికి నోరూరూతుంది అలాంటిది ఇక సరిగా చేస్తే లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే ఎన్ని వెరైటీలు ఉన్నా కానీ నెల్లూరు చేపల పులుసుకు మాత్రం సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు అనడంలో సందేహం అక్కర్లేదు. అంతే కాకుండా చేపల్లోని ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పులుపు కలగలిసి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు మరియు యాంటీ-ఆక్సిడెంట్లను అందిస్తాయి. దాంతో ఆరోగ్యం, రుచి రెండూ అందించే వంటకంగా చేపల పులుసు నిలుస్తోంది.
అలానే నెల్లూరు చేపల పులుసు స్టైల్ లోనే బాగా ఫేమస్ అయిన మరో ప్రత్యేక వంటకం అంటే మామిడికాయ చేపల పులుసు అనే చెప్పాలి. ఈ ప్రాంతం లోని వారిని ఇది మరో సాంప్రదాయంగా వండే వంటకంగా నిలుస్తుంది. పచ్చి మామిడికాయ వాడటం వల్ల చేపలు పులుసును బాగా పీల్చుకుని అదిరిపోయే రుచినిస్తాయి. దీన్ని వేడి వేడి అన్నంతోనూ, జొన్న రొట్టెలతోనూ, లేదా దోసెతోనూ తింటే అద్భుతంగా సరిపోతుంది. ఇప్పుడు ఈ అద్భుతమైన మామిడికాయ చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

మామిడికాయ చేపలపులుసు కోసం కావాల్సిన పదార్థాలు..
- చేప ముక్కలు - 8-10
- ఎర్ర కారం - 1 టేబుల్ స్పూన్
- పసుపు - 1 టీస్పూన్
- ఉప్పు - 1 టీస్పూన్
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- మెంతులు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 8-10 ఆకులు
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)
- పచ్చిమిర్చి - 2-3 (పొడవుగా చీల్చాలి)
- టమాటో - 1 (క్యూబ్స్‌గా)
- పచ్చి మామిడికాయ - 1 చిన్నది (తొక్కతోనే ముక్కలు చేయాలి)
- చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - గార్నిష్ కోసం
- ఉప్పు - 1 టీస్పూన్
- ఎర్ర కారం - 1 టేబుల్ స్పూన్
- పసుపు - 1 టీస్పూన్
మామిడికాయ చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను కడిగి పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. మసాలాలు పట్టించి కనీసం 15 నిమిషాలు ఆరబెట్టాలి. ( ఇలా చేస్తే చేప వాసన పోతుంది, మసాలా లోపలికి బాగా పడుతుంది.)
ధనియాలు, మెంతులను పాన్‌లో 2 నిమిషాలు వేయించి చల్లారనివ్వాలి. తరువాత మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడగానే కరివేపాకు వేయాలి.
ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి.
టమాటో వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి.
ఇప్పుడు మామిడికాయ ముక్కలను వేయి 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి.
అనంతరం ఉప్పు, కారం, పసుపు, మెంతి-ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
చింతపండు రసం వేసి మరో 4-5 నిమిషాలు మరిగించాలి.
చివరగా చేప ముక్కలను జాగ్రత్తగా వేసి చేపలు తగలకుండా పాకలో సెట్టవ్వాలి.
తక్కువ మంటపై 15 నిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి.
ఫైనల్ గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
అదనపు సూచనలు..
ఎముకలున్న చేపలతో రుచి రెట్టింపు అనిపిస్తుంది.
పచ్చి మామిడికాయ పుల్లగా ఉండాలి, తీయగా ఉంటే రుచి తగ్గిపోతుంది.
పులుసు రాత్రంతా ఉంచితే మరుసటి రోజు రుచికి మరింత బాగుంటుంది.
చేప వేసిన తర్వాత కలపకూడదు.. కేవలం పాత్రను ఓ వైపు నుంచి ఓ వైపుకు జాగ్రత్తగా కదిపితే సరిపోతుంది.
రుచిని మరింత పెంచడానికి ఒక చిన్న ముక్క వెల్లుల్లి లేదా ½ టీస్పూన్ మిరియాల పొడి వేసుకోవచ్చు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications