పది నిమిషాల్లో తయారయ్యే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి.. ఇలా చేస్తే అన్నం మెతుకు మిగలదు!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆరోగ్యం కోసం మంచి ఆహారం తినాల్సిన అవసరం ఉంది అన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక అటువంటి ఆహారంలో మన అన్ని రకాల కూరగాయలను, ఆకుకూరలను తీసుకోవడం మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. కొంతమందికి కొన్నిరకాల కూరగాయలు ఇష్టం ఉండవు. అయినా వాటివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి అనుకుంటే మనం కూర రూపంలో కాకుండా పచ్చడి రూపంలో కూడా చేసుకోవచ్చు.
మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి
ప్రతి కూరగాయలోనూ మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో వివిధ రకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటాం. ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకాన్ని వండుకొని తింటూ ఉంటాం. అన్నిరకాల కూరగాయలను కలిపి మిక్స్ చేసి కూరలు వండుకున్నా, పచ్చళ్ళు చేసుకున్నా దాని ప్రయోజనాలు మన శరీరానికి బాగా ఉంటాయి. ఈరోజు మనం సరిగ్గా పది నిమిషాల్లో తయారయ్యే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఏవిధంగా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు
టమాటాలు- 2
బీరకాయ- ఒకటి
వంకాయలు- నాలుగు
క్యారెట్- ఒకటి
దొండకాయలు- నాలుగు
పచ్చిమిరపకాయలు- 15 (కారాన్ని బట్టి)
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు- రెండు రెమ్మలు
ఉప్పు- రెండు స్పూన్లు
జీలకర్ర- రెండు స్పూన్లు
వెల్లుల్లిపాయలు- 8 రెబ్బలు
నూనె రెండు స్పూన్లు
తయారీ విధానం
ముందుగా మనం పచ్చడి చేయాలనుకుంటున్న కూరగాయలు అన్నింటిని ముక్కలుగా కట్ చేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి కూరగాయల ముక్కలు, పచ్చిమిరపకాయలు అందులో వేసి మగ్గనివ్వాలి. అందులోనే చింతపండు కూడా వేయాలి. కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇలా చేస్తే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి రెడీ
ఆపై రోట్లో కానీ, మిక్సీలో కానీ, ఈ వేయించుకున్న మొత్తం మిశ్రమాన్ని, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు తో కలిపి బాగా మెత్తగా పేస్ట్ లా కాకుండా రుబ్బుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి రెడీ అయినట్టే. చాలా తక్కువ సమయం లో తయారు చేసుకోగలిగిన ఈ పచ్చడి మనం దేనితో తిన్నా సరే రుచిగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది.
-
చుక్కకూర మటన్ కర్రీ సూపర్ టేస్ట్.. ఇలా చేస్తే అన్నం మెతుకు కూడా వదిలిపెట్టరు -
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
"బ్రకోలి కర్రీ" ఎప్పుడైనా ట్రై చేశారా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications