వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SBI recruitment: 1438 పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో 1,438 ఖాళీలను భర్తీ చేస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఎస్బీఐ వెబ్‌సైట్‌లోని కెరీర్‌ల విభాగాన్ని https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers సందర్శించాలి. దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 10.

తాజా ఎస్బీఐ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ దాని రిటైర్డ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఓపెనింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ అవసరానికి అనుగుణంగా తగినంత పని అనుభవం, మొత్తం వృత్తిపరమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. సెంట్రల్ బ్యాంక్ తన లిస్టింగ్‌లో ఇలా పేర్కొంది.. "రిటైర్డ్ ఆఫీసర్లు/సిబ్బంది 60 ఏళ్ల వయసులో సూపర్‌యాన్యుయేషన్ పొందిన తర్వాత మాత్రమే బ్యాంక్ సర్వీస్ నుంచి రిటైర్ అయి ఉండాలి.

 SBI recruitment 2023: apply for 1,438 vacancies

స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన లేదా సస్పెండ్ అయిన అధికారులు అర్హులు కారు. రాజీనామా చేసిన వారు కూడా తాజా ఎస్బీఐ రిక్రూట్‌మెంట్ 2023కి అర్హులు కారు.

మొత్తం ఖాళీలు:

మొత్తం- 1,438

General-680

OBC-314

SC- 198

EWS- 125

ST- 121

ఎంపిక ప్రమాణాలు:

షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అధికారులను ఎంపిక చేస్తారు. ఎస్బీఐ షార్ట్‌లిస్టింగ్ కమిటీ ద్వారా అధికారులు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలస్తారు. ఇంటర్వ్యూలో 100 మార్కులు ఉంటాయి, అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూ దశ తర్వాత, అభ్యర్థుల తుది జాబితాతో కూడిన మెరిట్ జాబితా తయారు చేస్తారు. మెరిట్ జాబితా రాష్ట్రాలు/సర్కిల్ వారీగా, కేటగిరీల వారీగా డ్రా చేస్తారు.

జీతం:

ఎంపిక చేయబడిన అధికారులు నాలుగు గ్రేడ్‌లలో నియమిస్తారు. క్లరికల్, JGMS-I, MMGS-II, MMGS-III.

క్లరికల్- రూ. 25,000

JGMS-I- రూ. 35,000

MMGS-II- రూ. 40,000

MMGS-III- రూ. 40,000గా జీతం చెల్లిస్తారు.

English summary
SBI recruitment 2023: apply for 1,438 vacancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X