ఇంటికి కిటికీలు ఎలా ఉంటే మంచిది?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనులు తమ గృహములను నిర్మించుటకు ముందు దాని నిర్మాణము యొక్క నమూనాను తయారు చేయించుకొనవలెను. అందు ముందుగనే ద్వారాలు, కిటికీలు, అలమారాలుంచు స్థానాలు ప్లానులో సూచించబడవలెను.

ద్వారములు, కిటికీలు మరియు అలమారాల కొలతలు వాటి వెడల్పుల కంటే రెట్టింపు పొడవుండుట మంచిది.

1. ఇంటిలోని ద్వారములన్నియు ఒకే కొలతలో నుండవలెను.
2. అవి కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా యుండుట మంచిది కాదు.
3. ఈశాన్యములో అన్నిటికంటే చిన్నద్వారముంచుట మంచిది. పెద్దద్వారముంచుట మంచిది కాదు.
4. ద్వారాలు కాని, కిటికీలు గాని, అలమారాలు గాని సరి సంఖ్యలలో ఉండవలెను. లేకున్నను సంఖ్య ముఖ్యము కాదు.
5. ద్వారాలు, కిటికీలు, అలమారాలు ఒకదానికొకటి ఎదురుగా నుండవలెను.
6. వరుసగా మూడు ద్వారాలుండకూడదు.
7. వరుసగా నాలుగు ద్వారాలమర్చవచ్చును.
8. ద్వారాన్ని పూర్తిగా గోడకు గాని పిల్లర్కుగాని ఆనించి నిర్మించకూడదు. తక్కువకు
తక్కువ నాలుగైదు అంగుళాలైన ఎడం ఉండవలెను.
9. ప్రధాన గృహములోని ద్వారాల సంఖ్యయే ఆ గృహము యొక్క ద్వారాల సంఖ్య గాని కాంపౌండులోని ఇతర గదులవి దానిలో కలియవు. బయట కాంపౌండు లోపల వేరుగా నిర్మించిన వాని ద్వారాల సంఖ్య వేరుగా లెక్కించవలెను.

astrologer tells about windows in house

"ద్వారాల సంఖ్య కన్న- ద్వారాల స్థానం ముఖ్యం"
ఇంటిలోని ద్వారాల సంఖ్యకు ఆ ఇంటిలోని "కమానులు గాని", గ్రిల్ తలుపులు
గాని లెక్కలోకి తీసుకొనగూడదు.

ఇంటి పైకప్పుును తాకకుండ వుండే తలుపులు అనగా లెట్రిన్స్ బాత్రూమ్స్ తలుపులు పైకప్పుకు తాకవు. కావున వాటిని లెక్కలోకి తీసుకొనకూడదు.
సాధారణముగా గృహసులు పూజాగదులు నిర్మించునపుడు ఒక మూలన దానిని ప్రత్యేకముగా చిన్నగదిగా నిర్మించి దాని ద్వారము పైకప్పును తాకని రీతిగా ఏర్పాటు చేయుదురు. కనుక అది కూడ లెక్కలోనికి రాదు.

ద్వారములుంచునపుడు ద్వారమునకు ఎదురుగా ద్వారము యుంచుట మంచిది. ఏ కారణము చేతనైనను పారు తప్పించి యుంచవలసి వచ్చిన, పారు తప్పి ఈశాన్యమున యుండవలెను గాని, ఆగ్నేయమునకుగాని, నైరుతికిగాని, వాయవ్యమునకు గాని యుండకూడదు. అనగా పారు తప్పించి ద్వారములు యుంచవలసి వచ్చినపుడు ఎంత ఉచ్చములోనికి పెట్టినను పెట్టవచ్చునుగాని, నీచములో యుంచకూడదు. గృహమునకు ఎక్కడను మూడు ద్వారములుంచకూడదు. మరి ఈశాన్య గదికి మూడు ద్వారములుండకూడదు.

ఇంటికి బహిఃప్రదేశమున తూర్పు ఆగ్నేయములో గదికి నీచమైయిన స్థానములో ద్వారమంచిన ఆర్థిక కలుగును. గదిలోనికి ఉచ్ఛమైన శుభము కలుగును.
ప్రహరీ గోడలకు గుమ్మములు సాధ్యమైనంతవరకు తూర్పు, ఉత్తరములకే యుంచవలెను. అనగా తూర్పు, ఉత్తరపు గోడలలో ద్వారాలుంచుట మంచిది. దక్షిణ, పశ్చిమ గోడల యందు కూడ గుమ్మములుంచవచ్చును. కాని అవి గోడలకు మధ్యయందు ఉంచవలెను.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about effects windows in house.
Please Wait while comments are loading...