• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘ఆత్మ’ దాని స్వరూపం: అసలు ‘ఆత్మ’ అంటే ఏమిటి?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా
ఉంటుంది?
ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు.
దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం
మందికి తెలియదు.

దాదాపు చాలా మందికి ఆత్మ అంటే
తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు
దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని
రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన
ఆత్మ స్వరూపాన్ని ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు
ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు.

ఇది అజ్ఞానపు ఆలోచన

ఇది అజ్ఞానపు ఆలోచన

ఎవరో ఒక తెలిసి తెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం
సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే
పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి
ఉచ్చరించి ఉంటారు.అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులల్లో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు.కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం.

శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..?

శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..?

మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన
తీసుకోవడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా
చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ
అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు.
వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా
తెలిసి ఉంటుంది.

ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ
పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు "ఎవరో ఒక
మహా పురషుడు మాత్రమే ఈ ఆత్మను
ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక
మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా
వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన
దానినిగా వినును. ఆ విన్నవారిలో చూచినవరిలో
చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా
తెలుసుకోలేరు.

 దైవమా? దయ్యమా?

దైవమా? దయ్యమా?

నిజానికి ఆత్మ అంటే దైవమా? లేక
దయ్యమా? ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా
అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి
అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ
ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో
లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న
మత గ్రంధమే లేదు కాని సరిగా దాని అంతరార్ధాన్ని
తెలుసుకోలేక సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా
గ్రహింపలేక దానికి నానార్ధాలు చెబుతూ చాలామంది వారు
అయోమయం అవడమే కాక అందరిని అయోమయంలో
నెట్టేస్తున్నారు.

ఎవరికీ తెలియదు..

ఎవరికీ తెలియదు..


ఈ ఆత్మ అంటే నిజానకి ఎవరికీ నిజంగానే తెలియదు.
దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు
మాత్రమే అది ఏమిటో దాని తత్వము ఏమిటో అసలు ఈ
సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే
తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను
సైతం బోధించే వాల్లకు కూడ అది ఎలా ఉంటుందో
తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు
కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు.

 అలాంటి వారికే ఆత్మ సాక్షాత్కారం

అలాంటి వారికే ఆత్మ సాక్షాత్కారం


ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా
తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని చాల
శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని ఎన్నో
గుడార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన గాని
అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మ కోసం
హృదయ పూర్వకంగా ఆరాటపడి మనననిధి ధ్యాసలు
చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి
వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.

భగవద్గీతలో ఇలా..

భగవద్గీతలో ఇలా..

ఆత్మ మనోబలం లేనివారికి అజాగ్రత్త పరులకు
శాస్త్ర విరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు.
అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా
ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం
పొందగలదు.

ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి
బోధించాయో కూడ తెలుసుకుందాం.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ
విషయమై ఈ విధంగా తెలిపినాడు.
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను ఆత్మ
ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ
ఇద్దరును అజ్ఞానులే.

నాశనం లేనిది..

నాశనం లేనిది..


ఏలాగంటే వాస్తవముగా ఆత్మ
ఎవ్వరిని చంపదు. ఎవ్వరి చేతను చంపబడేది కాదు.
ఆత్మకు చావు పుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది.
నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము
చంపబదడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము,
నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు
మార్పులేనిదనియు శాశ్వతమైనది
సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్తిరమైనది
మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు
గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు
లేనిది. ( 2:19-25)

ఉపనిషతులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి
ఈ విధంగా వివరించబడినది.

 ఆత్మ ప్రకాశం

ఆత్మ ప్రకాశం

జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే
సూక్ష్మం అంతటా వ్యాపించినది. అత్యంత
సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది.
అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ
ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది
సూక్ష్మతి సూక్ష్మం అది ఈ శరీరలోనే ఉన్నది.
అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు
(చుక్కలు) వెలుగు నీయవు.

మెరుపులు కూడ కాంతి
నీయవు.
స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే
సర్వము కాంతులను వెదజల్లుతుంది.ఈ ఆత్మ జ్యోతి వల్లనే దేదీప్య మానమవుతూ
ఉన్నది.

స్వయం ప్రకాశితం

స్వయం ప్రకాశితం

స్వయం ప్రకాశిత మైన జ్యోతి స్వరూపమైన ఆత్మను
మాటలచేత వర్ణింపలేము దానిని కళ్ళు
చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు
విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై
స్వచ్చ మైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం
విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యాన నిమగ్నుడైనవాడు
మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.

ఆత్మ అంటే ఒక శక్తి .మనం అర్ధం చేసుకోవడానికి
దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి
శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది.
సంపుర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ
జ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని
తెలుసుకొని కాంతి వంతంగా స్వయం ప్రకాశితమైన ఆ
దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకుని,
నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన
ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం
చేసుకుందాం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Astrologer told the story about Atma.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more