• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ పరమ ఔషదం

|

డా.యం.ఎన్.చార్య, హైదరాబాద్- ఫోన్: 9440611151

మనకు ప్రస్తుతం ఎండలు ఎక్కువ అవుతున్నవి.రాబోయే రోజులలో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఏడాకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి.మానవ శరీరానికి అతి వేడి పడదు.వడదెబ్బలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాడానికి మార్గలను సూచిస్తున్నాను.వేసుకునే దుస్తులు కాటవి అయి ఉండాలి.రోజుకు రెండు సార్లు స్నానం చేయండి.మాసాల తిండి,వేపుల్లు ,మాంస కృతులను తగ్గించండి.

ఎక్కువ మోతాదులో కుండ నీటిని త్రాగండి.పండ్ల జ్యూసులు,నిమ్మరసాలు,ఫలుదా,రాగి జావ త్రాగడం వలన ఆరోగ్యం అదుపులో ఉంటుంది.దీనికి తోడు టీ ( చాయి ) కాఫీలు మానేసి మజ్జిగ త్రాగండి.వచ్చే అతిధులకు మజ్జిగను ఇవ్వండి.పూర్వం ఇంటికి ఎంతటి గొప్ప అతిధి వచ్చిన మంచి కమ్మటి చిక్కటి మజ్జిగను అందించే వారు దీని వలన ఎందన పడి వచ్చిన వారికి దేహామే కాదు మనస్సు శాంతి చెందుతుంది తత్ ఫలితంగా ఒక రకమైన గ్రహాశాంతి చేసిన పుణ్యఫలం దక్కుతుంది.

మజ్జిగ వలన లాభాలేంటో గమనిద్దాం:- పెరుగు , నీరు సమాన పాళ్ళలో కలిపి చిలికి తయారుచేసిన మజ్జిగ తేలికగా ఉండి శీఘ్రముగా జీర్ణం అగును. కొంచెం వగరును , పులుపును కలిగి ఉండును. జఠరాగ్నిని వృద్దిచెందించును. కఫవాతాలను హరించును . శోఫరోగం , ఉదరం , మొలలరోగం , బంక విరేచనాలు , మూత్రబంధం , నోరు రుచిని కోల్పోవుట , స్ప్లీన్ పెరుగుట, గుల్మం , అధికంగా నెయ్యి తినుట వలన కలుగు సమస్యలు , విషము , పాండురోగం వంటి సమస్యలను నివారించును.

Beat the heat with butter milk

మజ్జిగలో కూడా రకాలు కలవు. ఇప్పుడు ఆ రకాలను మీకు వివరిస్తాను. పెరుగుకు నీళ్లు కలపకుండా కేవలం పెరుగును మాత్రం చిలికి చేయబడిన మజ్జిగని "గోళ " అని అంటారు.పెరుగుకు నాలుగవ వంతు నీరు కలిపి కవ్వముతో చిలికి చేయబడిన మజ్జిగని "ఉదశ్విత" అనబడును. సగం భాగం నీరు కలిపి పెరుగును చిలికి చేసిన మజ్జిగని " తక్రము " అని పిలుస్తారు . పెరుగుకు మూడు వంతులు నీరు కలిపి చేయబడిన మజ్జిగని "కాలశేయ" అని పిలుస్తారు . వీటన్నింటిలో సగం పెరుగు , సగం నీరు కలిపి చేసిన తక్రము అని పిలిచే మజ్జిగ బహు శ్రేష్టమైనది. ఇప్పుడు మీకు తక్రము యొక్క విశేష గుణాలు గురించి వివరిస్తాను .

తక్రమను మజ్జిగని వాడుట వలన శరీరం నందు జఠరాగ్నిని వృద్దిచెందించును. వాంతి , ప్రమేహము , వాపు , భగంధరం , విషము , ఉదరరోగము , కామెర్లు , కఫము , వాతాన్ని హరించును .

వెన్నపూర్తిగా తీయని మజ్జిగను మందజాతం అని పిలుస్తారు . ఇది అంత తొందరగా జీర్ణం అవ్వదు . జిడ్డు కొంచం కూడా లేకుండా చిలకబడిన మజ్జిగని అతిజాతం అనబడును. ఇది మిక్కిలి పులుపుగా ఉండి ఉష్ణాన్ని కలుగచేయును. దప్పికను పెంచును. వగరు , పులుపు రుచుల కలిసిన మజ్జిగ మలబద్దకం కలుగచేయును . కేవలం పుల్లగా ఉండు మజ్జిగ మలాన్ని బయటకి పంపును . ఏమి కలపకుండా ఉండు చప్పటి మజ్జిగ ఉదరం నందు ఉండు కఫాన్ని హరించును.కాని కంఠము నందు కఫాన్ని కలిగించును.

మజ్జిగని ఉపయోగించకూడని సమయాల గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. గాయాలు తగిలినప్పుడు , మూర్చరోగము నందు , భ్రమ , రక్తపిత్త రోగము నందు తక్రమను మజ్జిగ వాడరాదు. అదే విధముగా మంచు కాలం నందు , శరీరంలో జఠరాగ్ని మందగించి ఉన్నప్పుడు , కఫముచే జనించిన రోగముల యందు , కంఠనాళం సమస్య యందు , వాతం ప్రకోపించినప్పుడు తక్రము అను మజ్జిగని ఉపయోగించవలెను .

శరీరం నందు వాతము ప్రకోపించినప్పుడు పులిసిన మజ్జిగని సైన్ధవ లవణము కలిపి తాగవలెను .పిత్తము ప్రకోపించినప్పుడు తీపిగల మజ్జిగ పంచదార కలిపి తాగవలెను. అదేవిధముగా శరీరము నందు కఫము ప్రకోపించినప్పుడు త్రికటుకముల చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన చూర్ణం మరియు ఉప్పు కలిపిన మజ్జిగ తాగవలెను.

కొంచెం పుల్లగా ఉండు మజ్జిగ శుక్ర వృద్ధికరం , మిక్కిలి పులుపు కలిగిన మజ్జిగ జఠరాగ్ని వృద్దిచేయును . పీనసరోగం అనగా ముక్కువెంట ఆగకుండా నీరుకారు రోగం , శ్వాస , రొప్పు వంటి రోగాలు ఉన్నప్పుడు మజ్జిగని కాచి తాగవలెను.శరీరంపైన వ్రణాలు లేచినప్పుడు మజ్జిగ వాడినచో అనేక సమస్యలు వచ్చును.

మజ్జిగకు ద్రవాన్ని శోషించుకొనే గుణం ఉండటం వలన నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మజ్జిగ ఇవ్వడం వలన నీటిని గుంజి మలమును గట్టిపడచేయును అందువలన విరేచనాలు తగ్గును. గేదె మజ్జిగ కామెర్ల రోగము నందు , పాండు రోగము నందు అద్భుతముగా పనిచేయును కావునా ప్రతీ ఒక్కరు భోజనం తర్వాత మజ్జిక ను త్రాగండి,త్రాగించండి.

ముఖ్యంగా ఈ ఎండా కాలం పశు,పక్షాదులకు తప్పక మీరు నివసించే పరిసర ప్రాంతాలలో నీళ్ళను ఏర్పాటు చేసి వాటి దాహార్తిని తీర్చి పుణ్యఫలం కట్టుకోండి.ఎండన పడి నడిచే బాటసారులకు త్రాగడానికి నీళ్ళను అందించే సత్కార్యం చేయండి మీకు మంచి జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The summer’s scorching, but know how you can make it cool. Beat the heat with butter milk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more