ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త!
పరాభవ నామ సంవత్సర ఉగాది మార్చి 19వ తేదీన ప్రారంభమైంది. వేద క్యాలెండర్ ను అనుసరించి చైత్ర నవరాత్రులు కూడా ఇదే రోజు ప్రారంభమయ్యాయి. ఇక పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ తమ జాతకాలను పరిశీలించుకుంటున్నారు. ఈ క్రమంలో ధనస్సు రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం.
ధనుస్సు రాశి వారి ఆదాయ వ్యయాలిలా
ధనస్సు రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి . ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 6 గా ఉంటుంది. కొత్త సంవత్సరంలో గురుగ్రహ ప్రభావంతో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మే నెల వరకు గురువు అనుకూలంగా ఉంటాడు దీంతో అనేక శుభ ఫలితాలు వస్తాయి.

ఆర్థిక స్థితి
ఉగాది నుంచి ధనస్సురాశి వారి ఆర్థికస్థితి బాగుంటుంది. శుక్రుడు ఈ ఏడాది ఎక్కువకాలం అనుకూలంగా ఉండటం వల్ల ధనుస్సురాశి వారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. శుక్రుడు మొదటిస్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శని మూడవ స్థానంలో ఉండడం వల్ల సానుకూలఫలితాలు వస్తాయి కానీ శని నాలుగవ స్థానం నుంచి సంచారం శుభప్రదంగా ఉండదు. గురు అనుగ్రహంతోనే ధనుస్సురాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
వ్యాపారులకు
ధనుస్సు రాశి వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శని ఏడవ కోణం ఏడాది పొడవునా ఉండడం వల్ల పనులు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ధనుస్సు రాశి జాతకులు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మే నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్య కొత్తగా ఏ వ్యాపారాలను ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. ఈ సమయం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు కనుక జాగ్రత్త
విద్యార్థులకు
ముఖ్యంగా ధనుస్సు రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కెరీర్లోనూ ధనుస్సు రాశికి సంబంధించిన విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
కుటుంబ స్థితి
ధనస్సురాశి వారు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మే 11వతేదీ వరకు కుటుంబంలో శాంతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో వివాదాలు పెరిగే అవకాశం ఉంది.జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో భూమి, లేదా ఇంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. శని నాలుగవస్థానంలో సంచారం చేస్తే కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. కేతుప్రభావంతో కుటుంబసభ్యులకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. శని ప్రతికూలంగా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది.
ఆరోగ్యపరంగా
ధనుస్సురాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం కాస్త అలసట, ఒత్తిడి మరియు ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభం నుంచి జూన్ రెండు వరకు గురువు లగ్నస్థానంలో ఉండడం వల్ల సానుకూలఫలితాలు వస్తాయి. గురువు ప్రభావంతో పాటు శని నుంచి వచ్చే ప్రతికూలతలను ధనుస్సురాశి వారు ఎదుర్కోవచ్చు. అయితే అక్టోబర్ 31 2026 వరకు గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రతికూలఫలితాలు వస్తాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే?












Click it and Unblock the Notifications