వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీమహాలక్ష్మి అనుగ్రహం ఎలా పొందాలి?: సంపదకు ఏవి చేటు, ఏవి మేలు..

|
Google Oneindia TeluguNews

అమ్మవారి ఇవి స్వీకరించదు

వ్రత పుణ్యకార్యాల్లో దానాలనూ, దక్షిణలనూ వెంటనే ఇవ్వని వారంటే శ్రీమహాలక్ష్మికి అపార కోపం. అట్టి వాని ఇంటి నుంచి పోవడమే కాక వార్ని రోగిపులుగానూ, మహాదరిద్రులుగానూ చేస్తుంది. అలా దక్షిణ ఇవ్వని వారి పూజలూ, మొరలూ ఏ దేవతలూ స్వీకరించరు.

మహామొండి బాకీలు

మహా మొండి బాకీలూ, నమ్మకంగా చెప్పి ఎగొట్టిన ధనము తిరిగి రావాలంటే స్వారోచిత మనువు కాలంలో జన్మించిన సురథుని గాథలను (శ్రీదేవీభాగవతము) చదివితే ఆ జగజ్జనని సంపదలను కలిగిస్తుంది. పోయిన వైభవాన్ని తిరిగి రప్పిస్తుంది. రూపాయే కదా అని నిర్లక్ష్యంగా ఉండవద్దు.

 How to please mahalaxmi?, How people deprived of the blessings of dhanlaxmi?

రూపాయే కదాని వదిలేయొద్దు...రూపాయి విలువ మీకు ఖచ్చితంగా ఎప్పడు తెలుస్తుందో తెలుసా? కుటుంబంతో రెండో ఆట సినిమాకి వెళ్ళారు. ఆటోలో ఇంటికొచ్చారు. చిల్లర లేదు ఇద్దరి దగ్గరా, మీ ఆవిడ పర్స్ కూడా వెతికినా రూపాయి తగ్గింది. ఏంటి పరిస్థితి? ఆటో అతను రూపాయి తక్కువ తీసుకోవటానికి ఇష్టపడతాడా...? ఇలాంటి నిర్లక్ష్యాన్ని మగవాళ్ళ చేస్తుంటారు. అలా నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండండి. ఎన్ని రూపాయలు మిగులుతాయో మీకే తెలుస్తుంది.

వ్యసనాలు సంపదని పోగొడతాయి

ఏ అలవాటయినా సరే అది ఖచ్చితంగా ఎంతో కొంత ఆ వృత్తి నుంచి పక్కకి మళ్ళిస్తుంది. ఆ రేపు చేద్దాంలే అనిపిస్తుంది. అలా రోజులు గడుస్తూనే ఉంటాయి.
ఆర్థికంగా దెబ్బ తగిలి తేరుకోలేనప్పడు గాని అసలు విషయం అర్థం కాదు. బ్రహ్మదేవుడ్నించి వరాలు పొంది మహా విజయాన్ని పొందే అవకాశం ఉన్నా, ఇంద్రుని పత్రిక జయంతితో శుక్రాచార్యుడు పది సంవత్సరాలు సుఖించాడు.

ఆపై దేవతల మీదకు వెళ్ళినా పరాజయం మిగిలింది. ఆ జయంతి వ్యామోహాన్ని వదిలిపెడితే శుక్రాచార్యుడు దేవతల మీద విజయం సాధించేవాడు.

ఏ వైపుగా ఉండి భోజనాన్ని చేయాలి

ఇంటి ఇల్లాలు తూర్పు వైపుగానీ, ఉత్తరం వైపుగానీ కూర్చుని భోజనం చేయాలి. చీకటిలో భోజనాన్ని తీసుకోకూడదు. వీటిని పాటించిన లక్ష్మీదేవి అలాంటి వారి గృహాల్ని కనకమయం చేస్తుంది.

సంపదల కోసం చెయ్యల్సిన స్నానం
మహాధనసంపదల కోసం, శ్రీమహాలక్ష్మి ప్రాప్తి కోసం ఉసిరి కాయ పొడిని నీటిలో కలిపి తల స్నానమాచరించి శ్రీమహాలక్ష్మిని పూజిస్తే ఆ ఫలాలు కలుగుతాయి. కలిసి వస్తాయి.

ధనం ఎంతటి అకార్యానికైనా

ధనం ఎంతటి పనయినా చేయిస్తుంది. విశ్వామిత్రుడి భార్య సహితం ధనం కోసం తన పుత్రుడ్ని అమ్మాలని బిడ్డ మెడలో త్రాడు వేసి మరీ సంతకు తీసుకెళ్ళింది. కావున ధనాన్ని ఉన్నప్పడే పొదుపు చేసుకోండి. విచ్చలవిడిగా ఖర్చుపెడితే, అవసరమైన సమయాల్లో చేతులు చాపాల్సి వస్తుంది. లేదా చెయ్యకూడని కార్యాలను అయిష్టంగానైనా చెయ్యాల్సి వస్తుంది.

నాకేం ఇవ్వలేదు

ఇంతకన్నా తెలుగులో తక్కువస్థాయిపదం లేదు. అలా మాట్లాడేవాళ్ళంతా తమ చేతకానితనాన్ని తన తల్లీ, తండ్రి మీద వేసేవాళ్ళ అయి ఉంటారు. ఈ భారతదేశానికే ప్రధానమంత్రి అయిన పి.వి.నరసింహారావుకి వారి తల్లీ, తండ్రీ ఏ రాజకీయ అనుభవం ఇచ్చారు. ప్రపంచంలో అతి సంపన్నుడైన బిల్గేట్స్ తల్లీ, తండ్రీ నుంచి ఏం పొంది ప్రపంచంలోనే కోటీశ్వరుడయ్యాడు. ధీరూభాయి అంబానీ, చంద్రబాబు నాయుడూ, అంబిక, అంత గొప్పవాళ్ళతో పోలికెందుకు. మీ చుటూ ఉన్న వార్ని ఒకసారి పరిశీలించండి.

పరాశరుడు మునీశ్వరుడు. తపము, తీర్థ సేవనములు చేసేవాడు. కాని వాని పత్రుడు వ్యాసుడు తండ్రి నుంచి ఏం తీసుకొని అష్టాదశ పురాణాలను వ్రాశాడు.

సకల విద్యాపారంగతుడైనా ధనికుడి దగ్గర తలవంచాల్సిందే. సకల వేదశాస్రాలను ఔపోసన పట్టినవారూ, మహామేధావులూ, అపార ధైర్యసాహసాలు కలవారూ, మహాబలవంతులూ ఎవ్వరైనా ధనవంతుని వద్ద నిలబడాల్సిందే. ధనమున్నవాడ్ని మేధావులూ, ధైర్యసాహసాలున్నవారూ, అధికారమున్నవారూ సదా సేవిస్తుంటారు.

గుప్పెడు అటుకులకి మహాసంపద

శ్రీకృషుడు ధనరాసులను గుప్పెడు అటుకులను తెచ్చిన కుచేలునికి ఇచ్చాడు. మిత్రుడని ఇచ్చాడా? ఆ ఒక్క కారణమే కాదు. ఆ తెచ్చిన అటుకులు ధర్మమైనవి. అన్యాయార్జితం కాదు. అందుకే లక్ష్మీపతి న్యాయధర్మపద్ధతిలో సంపాదించిన అటుకులకి విలువ కట్టాడు. మహాసంపదలని ఇచ్చాడు. భగవంతునికి పెట్టే నైవేద్యాలు అంత ధర్మసంపాదనవి అయితేనే శ్రీమహాలక్ష్మి కరుణించి కటాక్షిస్తుంది.

భయపడవద్దు

భయపడితే మహాసర్పమై కాటు వేస్తుంది. అలాగే పరిస్థితి చేయి జారకముందే మేల్కొనండి. అప్పలెన్నిఉన్నాయి? ఎంత? ఎట్టిపరిస్థితుల్లో తీర్చాలి. దానికి చెయ్యాల్సింది ప్రొడక్షన్. నెలకి లక్షరూపాయలు ప్రొడక్షన్ చేస్తుంటే, పదివేలు సంపాదిస్తారనుకుందాం.నెలకి యాభై కావాలి. సోమీరు ప్రొడక్షన్ ఐదులక్షలు దాటించాలి. ఎలా..ఏమిటి సాధ్యమా?

English summary
How to please mahalaxmi?, How people deprived of the blessings of dhanlaxmi?, Obstacles in getting the blessings of dhanlaxmi, Ways to increase earning,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X