గృహ ప్రవేశం: అసలు అదెలా వచ్చింది, ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

మన దేశ హైందవ సాంప్రదాయంలో గృహ ప్రవేషం అనేది పెద్దవేడుక. అందులో ఒకప్పుడు రెండు రకాలుగా గృహప్రవేశాలు జరుపే ఆచారం ఉండేది.మొదటి గృహప్రవేశం అనేది క్రొత్త పెళ్ళికూతురు పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చినప్పుడు ఘనంగా జరుపుకునేది ఒకటి.కాని ఈ రోజుల్లో కొందరు పెళ్ళికి ముందే కాబోయే అత్తరింటికి వచ్చిపోతున్నారు.లేకపోతే అదో పెద్ద తంతు కార్యక్రమమే.

ఈ ఆచారాన్ని ఇంత పవిత్రంగా ఎందుకు భావిస్తామంటే ఇంటి కొత్త కోడలు అత్తవారి ఇంట్లో అడుగు పెట్టి ఆ ఇంటి భవిష్యత్తుని, వంశాభివృద్ధి,ఇంటి జీవనశైలిలో ఎన్నోరకాల అభివృద్ధి పరమైన కార్యాలకు,మార్పులకు దోహదపడుతుంది.

కోడలు ఇంట్లోకి ప్రేమతో అడుగు పెట్టిన తర్వాత తన పుట్టింటి ఆత్మీయతలకు దూరమైనప్పటికి మెట్టినింటి అభివృద్ధి కొరకు తనవంతుగా కుటుంబానికి ఎనలేని,వేలకట్టలేని సేవలు చేయడం ద్వార ఈ సమాజంలో ఆకుటుంబానికి మంచి కుటుంబం అనే పేరు రావడానికి ప్రధాన పాత్రపోషిస్తుంది కాబట్టి గృహప్రవేశంగా భావించడం జరిగింది.

మన పూర్వంనుండి కొత్త పెళ్లి కూతురిని ఎంతో సాదరంగా, గౌరవ మర్యాదలతో, శుభ మూహూర్త శుభలగ్నంలో ఇంట్లోకి ప్రవేశ పెట్టడం అనే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది.నిజానికి ఇది ఎంతో ఆచార వ్యవహారాలతో కూడిన శుభకార్యం.కాని ఇప్పుడు అవన్ని మాయమై పోయాయి.పెళ్లి కాకమునుపే స్త్రీ తనకు కాబోయే భర్త ఇంట్లోకి ప్రవేశిస్తోంది.అందువల్ల ఈ రోజుల్లో ఆమె ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తోంది అన్నది ఒక పెద్ద విషయం కావటం లేదు.

అసలు ఈ రోజుల్లో వివాహమంటే స్త్రీ పురుషుల మధ్య ఒక ప్రేమ వ్యవహారం మాత్రమే అయిపోయింది. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఒక జంట మధ్య ఉండే అపురూపమైన అనుబంధమే వారి భావిజీవితాన్ని,మంచి సంతానాన్ని అందిస్తుంది. అందుకే మరి కొత్త పెళ్ళికూతురు యొక్క గృహప్రవేశం సవ్యంగా జరగడానికి మనపెద్దలు శాస్త్రపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు. గృహప్రవేశంలో ఇది మొదటి రకం.

ఇక రెండవది ఏదైనా ఒక కొత్త నిర్మాణం జరిపినప్పుడు దాన్ని నివాసయోగ్యం చేసే ప్రక్రియే గృహప్రవేశం.మన కొత్త ఇల్లు ఎంతో బాగుండాలని కోరుకోవడం అది సహజం. ఇంటి ప్లానూ,కట్టేవిధానం,రంగులు వేయడం,మొదలగునవి అన్ని ముఖ్యమే. అంతకన్నా ఆ స్థలంలో అనుకూల శక్తి ప్రభవిల్లుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక విధంగా చూస్తే గృహప్రవేశం ఒక చిన్న ప్రతిష్ట లాంటిదే.

అసలు గృహప్రవేశం చేయకుండా..

అసలు గృహప్రవేశం చేయకుండా..

ఇలా గృహప్రవేశం చేయకుండా ఎవరూ ఇంట్లో చేరేవారు కాదు. ఇవన్ని కూడా ఇంట్లో జీవశక్తిని పెంపొందించి, అందులో నివసించేవారి పురోభివృద్ధికోసమే.

ప్రజలు తమకు తెలిసిన రీతిలో ఈ ప్రాణ ప్రతిష్ట చేసి, ఆ తరవాతే ఆ ఇంట్లో నివాసానికి చేరేవారు. పూర్వం, రాజులు ఉదార స్వభావులూ, ప్రజాహితం కోరుకునేవారు ఐతే ఊరు మొత్తానికి ప్రాణప్రతిష్ఠ చేసేవారు దీనికి ఉదహారణనే మన ఊరిలో మనం చూస్తూన్న బొడ్రాయి.అలా రాజ్యమంతటా ప్రాణ ప్రతిష్ట చేసిన స్థలాలు కనిపిస్తాయి. ఎందుకంటే అందరూ అటువంటి చోట్ల నివసించడం మంచిదని శాస్త్రపరంగా వారికి తెలుసు.

ఇంటి స్థలాలు ఎంతో అవసరం..

ఇంటి స్థలాలు ఎంతో అవసరం..

ప్రజలు వీధుల్లో నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా ఈ జీవభరిత స్థలంలోనే వారి జీవనం ఉండేది. ఎందుకంటే అద్భుతమైన శక్తివంతులూ, మేధావులూ, సమర్ధులూ తయారవ్వాలంటే ఇటువంటి స్థలాలు ఎంతో అవసరం. ఇలా కాని పక్షంలో తమ వ్యక్తిగత సామర్ధ్యాన్ని బట్టి ఎక్కడో ఒకరో ,ఇద్దరో ఏదో సాధించగలరేమో కాని ఒక అద్భుతమైన తరాన్ని మాత్రం సృష్టించలేము.

అంటే అనాది నుండి మన సంస్కృతిలో ప్రాణ ప్రతిష్ట చేయని స్థలాలు మనుషులకు నివాసయోగ్యం కాదనుకునే వారు. మనం మొక్కను భూమిలో నాటితే అది సారవంతమైన మట్టి ఐతేనే పూలూ, పండ్లూ వస్తాయి. భూమి నిస్సారమైనది, తగినంత సారవంతం చేయబడనిదీ అయితే, పూలూ, పళ్ళూ రావు. వచ్చినా చాల తక్కువే, అది ఎప్పుడూ అంత ఫలవంతం కాదు.

అప్పుడు ఇలా ఉండేది...

అప్పుడు ఇలా ఉండేది...

అందుకే ఈ జీవన విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనివలనే మన సంస్కృతి అపార జ్ఞానాన్నీ, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహానీయులనూ ఇచ్చింది. ఇలాంటి అనేక విషయాలపై శ్రద్ధ తీసుకున్నారు కాబట్టే ప్రతి తరంలోను ఇలాగే ఉండేది. ప్రపంచంలో మరే సంస్కృతిలోనూ ఏ ఒక్క తరం వారూ అంత మహోన్నత శిఖరాలను చేరుకోలేదు.

పూర్వం దాదాపు ప్రతీ కుటుంబానికీ ఇంట్లో చేరక ముందు గృప్రవేశం చేసుకునే అదృష్టముండేది. ప్రతి ఇంటిలో నియమిత కాలంలో ఇంటి ఉన్నతి కోసం అవసరమైన సంస్కార కర్మలు చేసేవారు.

సంస్కార కర్మలు చేసేవారు..

సంస్కార కర్మలు చేసేవారు..

దీనికి కావలసిన సంస్కార కర్మలు కనీసం ఏడాదికి ఒకసారన్నా ఇంటి ఉన్నతి కోసం చేసేవారు. మనిషి పూర్తి సామర్ధ్య వికాసానికి సరైన వాతావరణం కల్పించడం అవసరమని తెలుసు కోవడం వల్లే ఇలా చేసేవారు.

పూర్తి సామర్ధ్యమంటే ఈ కాలం వారికి ఎంత డబ్బు సంపాదించగలరు అనే. దురదృష్ట వశాత్తూ ఆధునిక యుగంలో సాఫల్యం అంటే చాల వికృతంగా,మోటుగా తయారయింది.నువ్వు సామాజికంగా ఎంత ఎదుగ గలవు, ఎంత సంపాదించగలవు, ఇదే విజయానికి నిర్వచనం.

అసలు విజయమంటే ఇదీ..

అసలు విజయమంటే ఇదీ..

పూర్వకాలంలో విజయమంటే ఇదికాదు.అది చాల సర్వతోముఖమైనది. ఎవరైనా కొంత ఎరుక ఉన్నవారు, తన గురించి, తను ఉన్న ప్రపంచం గురించి తెలిసిన వారినే సమర్ధవంతులు అనేవారు. సామాజికంగా గౌరవింపబడినవారూ, ఆర్ధికంగా వృద్ధిచెందిన వారూ, సంఘంలో, కుటుంబంలో, స్నేహితుల దగ్గర, ప్రేమ చూరగొన్నవారినే సమర్ధవంతులు అనేవారు, మరి సమాజం కూడా అలానే చూసేది. ఎంత సంపాదించినా, ప్రజల ఆదరాభిమానాలు లేకపోతే, ఆ జీవితం నిరర్ధకమనేవారు. క్రిందటి తరం వరకూ, "ఎంత సంపాదిస్తే ఏమిటి? నీవు ఇతరుల ప్రేమాభిమానాలు పొందావా? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రేమిస్తున్నారా అని బేరీజు వేసుకునేవారు.కాని ఈ పోటి ప్రపంచంలో మారిన ఈ సమాజంలో మమతలకంటే మనీ గొప్పదైంది. ఈ నాడు పండగ చేయడంలో కూడా హోదా కోసమే తాపత్రయపడుతున్నారు.

గృహ ప్రవేశమంటే ఇదీ...

గృహ ప్రవేశమంటే ఇదీ...


గృహప్రవేశమంటే 'మీరు' అనే ఈ మొక్క బాగా పెరిగి, పండ్లూ, పూలూ ఇచ్చేందుకు అవసరమైన సారవంతమైన నేలను సమకూర్చుకోవటం లాంటిది. దురదృష్టవశాత్తూ వీటిని నిర్వహించేవారు అసలు వీటిని ఎందుకు చేస్తున్నారో గ్రహించి, దాని ప్రకారం వీటిని నిర్వహించే బదులు, ఏదో మొక్కుబడిగా నిర్వహించేసి ఈ గృహప్రవేశమనే ప్రక్రియను నామమాత్రంగా జరిపిస్తున్నారు. అందుకే ప్రజలు ఇటువంటి పద్ధతులను వదిలేస్తున్నారు. ఈ కాలంలో క్రొత్త ఇంట్లోకి చేరటమంటే ఒక విందు ఇవ్వటం, అందులో యదేశ్చగా మితిమీరి తినటం, త్రాగటం అవుతుంది. ఇలాంటి కారణాలచేత పురోభివృద్ధి చెందటం లేదు.భారతీయ జీవన విధానం అనేది ఎంతో ఉన్నతమైనది.పాశ్చత్య సంస్కృతి మోజులో ప్రస్తుత సమాజం ఆచార వ్యవహారాలను పాటించడంలేదు.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explained the importance of house warming function.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి