వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరస్వతీ దేవి పుట్టిన రోజు ‘శ్రీపంచమి’ ప్రత్యేకత

మాఘశుద్దపంచమి శ్రీ పంచమి అయి ఉన్నది. పంచాంగకర్తలు ఈనాటి వివరణలో శ్రీపంచమి, మదనపంచమి, వసంత్సోవారంభః, వసంతపంచమి, రతికామ దమనోత్సవ, సరస్వతీ జయంతి అని వ్రాస్తారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాఘశుద్దపంచమి శ్రీ పంచమి అయి ఉన్నది. పంచాంగకర్తలు ఈనాటి వివరణలో శ్రీపంచమి, మదనపంచమి, వసంత్సోవారంభః, వసంతపంచమి, రతికామ దమనోత్సవ, సరస్వతీ జయంతి అని వ్రాస్తారు.

వసంతోత్సవారంభః అనే చోట కొందరు పంచాంగకర్తలు వసంతపంచమి అని ఉదాహరిస్తారు. వసంతపంచమినామాన్ని పట్టి ఇది బుతుసంబంధమైన పండుగగా భావించవలసి ఉంటుంది. మాఘఫాల్మణాలు శిశిర ఋతువు. చైత్రవైశాఖాలు వసంతఋతువు. శిశిర ఋతువు ప్రారంభంలోనే వసంత ఋతుసంబంధంగా ఈ వసంత పంచమి పర్వం చేయడానికి కారణం ఏమో తెలియటం లేదు.

మకరసంక్రాతికి తరువాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఆ కాలంలోనే క్రమంగా వసంత ఋతులక్షణాలైన చెట్ల చిగర్చడం, పూలు పూయడం మొదలయినవి కనిపిస్తాయి. "మాఖాద్యా పంచవసణ" అనే ఉక్తి ఒకటి ఉంది. మాఘమాసమే వసంత ఋతువునకు ఆరంభమనే మతం ఒకటి ఉంది. ఆ వసంత ఋతు సూచనలకు ఈ వసంత పంచమి స్వాగతోపచారాలు చేసే పర్వంగా ఎంచుకోవలసి ఉంటుంది. రాగల వసంత ఋతువుకు శిశిర ఋతువులో చేసే స్వాగతోపచారం ఈ పండుగ.

Astrologer described about sri panchami.

విద్యారులు ఉపాధ్యాయులు శ్రీపంచమి పర్వాన్ని జరిపి సరస్వతిదేవి పూజ సాగిస్తారు. వసంతి పంచమినాడు ఒక్క వంగదేశంలోనే సరస్వతి విగ్రహాన్ని నెలకొల్పి పూజించడం ఆచారమై ఉంది.

సరస్వతిదేవి అహింసాదేవి. కాగా ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు కాని, రక్షణ యుద్ధం సాగించే ఆయుధాలు కాని ఏమి లేవు. గ్రీకుల, రోమనుల జ్ఞాన దేవత మినర్వా హిందువుల సరస్వతిదేవి అని సర్విలియం జోన్సు అంటున్నాడు. తెల్లటి పద్మం మిూద సరస్వతీదేవి నిలబడి ఉన్నట్ల ఒక కాలు నిలువగాను ఒక కాలు దానిమిూద అడ్డముగాను ఉంచుకొని (Cross Legged) ఆమె ఒక చేతిలో వీణ మరియు ఒక చేత పుస్తకము ఉన్నట్లు పద్మ పురాణములో ఉంది. ఆమె తెల్లటి పద్మం మిూద నిలబడి ఉంది. ఆమె తెల్లటి దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె తెల్లటి పువ్వులు ధరించి ఉంటుంది. తెల్లపూసల కంఠహారం ధరిస్తుంది. ఆ కంఠహారం మిూద తెల్లటి గంధం పూత, ఆమె తెల్లటి వీణను పట్టి ఉంటుంది.

తెలుపు పవిత్రతకు, శాంతికి చిహ్నము. ఈ దేవికి రక్త పూర్వకమైన బలులు ఏమిూ ఈయబడవు. పూజా సందర్భంలో చదువుకు, వ్రాతకు సంగీతానికి సంబంధించిన పరికరాలన్నీ ఆమె ఎదుట ఉంచుతారు. పళు, మిఠాయిలు నైవేద్యం పెడతారు. తాగి తందనాలాడే విలాసలేవీ వుండవు. ఆనాడు సరస్వతీ పూజ చేసేవారు పసుపు పచ్చని బట్టలు ధరిస్తారు. రోజు అంతా పూజ చేస్తూ, కీర్తనలు పాడుతూ గడుపుతారు.

ఒక్క వంగదేశంలోనే సరస్వతి జయంతి ఈ విధంగా జరపబడుతూ ఈ పర్వానికి గదాధర పద్దతిలో సరస్వతీ పూజా అనీ, పురుషార్థ చింతామణిలో లక్ష్మీసరస్వతి, కృత్యసారసముచ్చయంలో వసంత పంచమిరా అనీ, గ్రంథాంతరాల్లో శ్రీపంచమి,రతికామపూజ, మున్నగు నామాలు వాడబడ్డాయి.

English summary
Astrologer described about sri panchami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X