vastu tips: అదృష్టాన్ని తెచ్చే ఈ మూడు వస్తువులతో ఇల్లు అలంకరించండి.. లక్ పరీక్షించుకోండి!!
ఇల్లు వాస్తు నియమాల ప్రకారం అందంగా కట్టుకున్నా, ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి, ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో శ్రద్ధ వహించాలని వాస్తు శాస్త్రం సలహా ఇస్తుంది. తత్ఫలితంగా, ఇల్లు సుసంపన్నం అవుతుందని సూచిస్తుంది. కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటమే కాకుండా డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కూడా కలుగుతాయని చెప్తున్నారు .

కొన్ని వస్తువులు ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి.. అవేంటో తెలుసా
అదృష్టం కోసం మీరు ఉపయోగించగల గృహాలంకరణ వస్తువుల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. సానుకూల శక్తిని ప్రోత్సహించే కొన్ని వస్తువులు ఇంటికి అదృష్టాన్ని తీసుకు వస్తాయి. వీటిని ఇంట్లో మనం ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం నుంచి బయటపడటమే కాకుండా, సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తామని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గృహాలంకరణ వస్తువులు విషయంలో ముఖ్యంగా మూడు వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు, సంపద కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ మూడు వస్తువులు విషయానికి వస్తే

సంపద కోసం ఇంట్లో వీటిని పెట్టుకోండి
వాస్తు శాస్త్రంలో ఏనుగు ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుందని చెబుతారు. లక్ష్మీ దేవిని లోపలికి తీసుకొచ్చి ఇంట్లోనే ఉండేలా చేస్తుంది ఏనుగు విగ్రహం . ఇంట్లో డబ్బు విషయంలో రోజూ గొడవలు, ఇంటి ప్రశాంతత దెబ్బతింటే ఇంట్లోకి వెండి లేదా ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని తెచ్చి పెట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంటికి రాహు దోష సంబంధిత సమస్యను కూడా పరిష్కరిస్తుందని చెప్తున్నారు.

శ్రేయస్సు కోసం ఇంట్లో పెట్టుకోవలసిన గృహాలంకరణ వస్తువు ఇదే
ఇక ఇంట్లో పెట్టుకోవాల్సిన మరొక గృహాలంకరణ వస్తువులలో తాబేలు ఒకటి. తాబేలును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇంటికి తూర్పు లేదా ఉత్తరాన ఉంచాలి ఎందుకంటే ఇది విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. మీరు ఇంటికి తీసుకువచ్చే ప్రతి తాబేలు విగ్రహం కొంత లోహాన్ని కలిగి ఉండాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. దీని ఫలితంగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ శ్రేయస్సుకోసం తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంటి పురోగతి కోసం ఈ గృహాలంకరణ వస్తువులను పెట్టండి
ఇక కుటుంబ సభ్యుల ప్రగతి కోసం, ఇంటి పురోగతి కోసం ఇంట్లో చేపల బొమ్మలను పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఇంటిలో ఇత్తడి చేపలు లేదా వెండి చేపల విగ్రహాలను ఉంచడం మంచిదని, ఇది ఇంటి పురోగతిని తెస్తుందని సూచిస్తున్నారు . మీరు చేపలను ఇంటికి తీసుకువచ్చి, వాటిని ఇంట్లో పెట్టాలనుకుంటే ఎల్లప్పుడూ ఈశాన్యం వైపు ఉంచాలని గుర్తుంచుకోండి. ఫలితంగా, కుటుంబానికి మంచి ఆదాయం సమకూరుతుంది . అంతేకాదు కుటుంబ సంతృప్తిలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications