vastu tips: మంచం మీద ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే మీ ఐశ్వర్యమంతా గోవిందా!!

ఇంటి నిర్మాణం చేయడానికి ఏ విధంగా అయితే వాస్తు అవసరమో, ఇంట్లో వస్తువులను అమర్చుకోవడానికి వాస్తు నియమాలు అంతే అవసరం. అలాగే కొన్ని వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల కూడా వాస్తు దోషాలు తలెత్తి, ఆర్థిక కష్టాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక తాజాగా మంచం మీద కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఆ ఇంట్లో ధన నష్టం జరుగుతుందని, తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

మంచం మీద కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం

మంచం మీద కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం

లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలి అంటే కొన్ని చెయ్యకూడని పనులు ఉన్నాయని సూచిస్తున్న వాస్తుశాస్త్ర నిపుణులు, ధన లక్ష్మి అనుగ్రహం కలగడానికి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. మంచం మీద కొన్ని వస్తువులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని, ఆమె ఇంటిని వీడి వెళ్ళిపోతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా మంచం మీద పెట్టకూడని వస్తువులు ఏమిటి అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.

మంచం భోగ స్థానం .. పసుపు, కుంకుమలు, దేవుడి సామాన్లు పెట్టరాదు

మంచం భోగ స్థానం .. పసుపు, కుంకుమలు, దేవుడి సామాన్లు పెట్టరాదు


మంచం మీద పెట్టకూడని వస్తువులు పసుపు, కుంకుమలు ముఖ్యమైనవి. పసుపు, కుంకుమలను ఎట్టి పరిస్థితులలోనూ మంచం మీద పెట్టకూడదు .మంచం అనేది భోగ స్థానం కావడంతో మంచం మీద ఎప్పుడూ కూడా అత్యంత పవిత్రంగా భావించే పసుపు కుంకుమలను, పూజా సామాన్యులను, పండ్లు, తమలపాకులను పెట్టకూడదని సూచిస్తున్నారు. భగవంతునికి నైవేద్యం పెట్టడానికి తీసుకువచ్చిన పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదు అని చెబుతున్నారు. అలా పెట్టడం వల్ల వాటిలో ఉండే దైవికమైన శక్తి నశించి, అవి మామూలు వస్తువులుగా మాత్రమే మిగిలి పోతాయని వెల్లడిస్తున్నారు. మీరు దేవుడికి నైవేద్యం పెట్టినా వాటి ప్రయోజనం ఉండదని చెప్తున్నారు. అందుకే మంచం మీద ఎట్టిపరిస్థితుల్లోనూ భగవంతుడికి నివేదించడం కోసం తీసుకువచ్చిన పదార్థాలను, దేవుడి దగ్గర పెట్టే సామాన్లను పెట్టకూడదు.

ముత్యాలు, సాలగ్రామాలు, రుద్రాక్షలే కాదు పెట్టకూడనివి ఇవే

ముత్యాలు, సాలగ్రామాలు, రుద్రాక్షలే కాదు పెట్టకూడనివి ఇవే


ముత్యాలను ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు. అలాగే మంచం మీద సాలగ్రామాలు, రుద్రాక్షలు ఎప్పుడూ పెట్టకూడదు. వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు మంచం మీద పెట్టకూడదు. మరకత ఆభరణాల్ని, పచ్చలను కూడా మంచం మీద పెట్టకూడదని చెబుతున్నారు. మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వల్ల మన ఐశ్వర్యం అంతా హరించుకు పోతుంది అని సూచిస్తున్నారు.
చాలామంది ఇళ్లల్లో బీరువాలో నుంచి బంగారు ఆభరణాలు బయటకు తీసిన తర్వాత వాటిని వెంటనే మంచం మీద పెట్టి చూసుకుంటారు. కానీ ఆ విధంగా చేయడం నష్టం చేకూరుస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఎంత బంగారం ఉన్నా బ్యాంకులలోనే.. మంచం మీద బంగారం పెడితే జరిగేదిదే

ఎంత బంగారం ఉన్నా బ్యాంకులలోనే.. మంచం మీద బంగారం పెడితే జరిగేదిదే


మంచం మీద బంగారం పెట్టటం వల్ల మళ్లీమళ్లీ బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఆ కుటుంబ సభ్యులకు వస్తుందని, అది దోషానికి కారణంగా మారుతుందని చెబుతున్నారు. బంగారు ఆభరణాలను బీరువాలో పెడితే, అది మరింత బంగారాన్ని రమ్మని పిలుస్తుంది అని, కాలం కలిసి వచ్చి మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారని చెబుతున్నారు. అదే బంగారాన్ని మంచం మీద పెడితే అది కొత్త బంగారాన్ని కొనకపోనివ్వగా ఇది కూడా బయటకు వెళ్లడానికి చూస్తుందని చెబుతున్నారు. అందుకే చాలామంది ఇళ్లల్లో ఎంత బంగారం ఉన్నా కూడా ఎప్పుడూ బ్యాంకుల్లోనే ఉంటుందంటూ చెబుతున్నారు.

మంచం మీద దిండ్ల క్రింద దేవుడి ఫోటోలను పెట్టకూడదు

మంచం మీద దిండ్ల క్రింద దేవుడి ఫోటోలను పెట్టకూడదు


అదేవిధంగా చాలా మంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే దేవుడు ఫోటో చూసి ఆ తర్వాత పనులకు ఉపక్రమిస్తారు. అయితే మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోలను పెట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మంచం ఎప్పుడూ యోగ స్థానం కాదని, ఐశ్వర్య స్థానం కాదని, అది కేవలం భోగ స్థానం మాత్రమేనని చెబుతున్నారు. అందుకే మంచం మీద ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పెట్టకూడదు అని సూచిస్తున్నారు. ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తించి పైన పేర్కొన్న వస్తువులను పెట్టకుండా ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే సంపాదించింది కూడా హరీ అంటుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+