• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నమస్కారం చేస్తే ఎక్కువ కాలం గుర్తుండిపోతారు, ఇదీ శాస్త్రీయం..

|

డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

మనిషి విజ్ఞానం వినయాన్ని నేర్పిస్తుంది. ఆ వినయ ప్రతి రూపమే నమస్కారం. సాటివారిలో దైవత్వాన్ని చూడడమే నమస్కార లక్షణం. నమస్కారం అన్న పదం సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతానికి చెందిన నమః అనే పదం నుంచి నమస్కారం అన్న పదం ఏర్పడినది. సంస్కృతంలో నమః అంటే విధేయత. ప్రకటించామని అర్ధం. మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు.

నమస్కారం అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవ సూచకం. నమస్కారం పెట్టడం అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం.

Why Namaskar and not a hand shake?

తల్లిదండ్రులకు, గురువులకు , అతిధులకు , పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి. మంచి నమస్కారం ఎలా ఉండాలంటే మనసు నిండా గౌరవాన్ని నింపుకుని వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి.అందుకే నమస్కారానిది హృదయం భాష అంటారు.

సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి.వినయపూర్వకంగా "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు.వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.

శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)

హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి.

తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.నమస్కారంలోని అంతర్గతం. హిందూ సంస్కృతిలో నమస్కారం విశిష్ట ప్రక్ధియ.

ఒకరికొకరు ఎదురైతే రెండు చేతులు జోడించి హృదయ స్థానం దగ్గర ఉంచి నమస్కారం చెప్పడం భారతీయ హిందువులకు అలవాటు.మామూలుగా చూస్తే నమస్కారం చేయడం అంటే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం.

నమస్కారం పెట్టడం అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం.ఇది అధ్యాత్మిక పరమైన వివరణ .

శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడు రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి తాకుతాయి. మనం చేతి వెళ్ల కొనలకు కళ్ళు చెవి మెదడులతో సంబంధం ఉంటుంది.నమస్కారం చేసేటప్పుడు

చేసేటప్పుడు వేలి కొనలు పరస్పరం ఒత్తుకోవడం వల్ల కళ్ళు చెవి మెదడు కేంద్రాలు ఉత్తేజమవుతాయి. దాంతో కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని మెదడు ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడం.వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచు కోవడం జరుగుతుంది.

అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి నమస్కారం పెడితే వాళ్ళు మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోతారని అర్థము. నమస్కారం పెట్టేటపుడు మనం ఎదుటి వాళ్ళను ముట్టుకోనవసరంలేదు.దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు సోకె ప్రమాదం ఉండదు.

భౌతిక సంబంధం లేకపోవడంవల్ల.ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన ప్రదానం జరుగుతుంది.ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల ఒకరి నుంచి చెడు భావనలు మరొకరిలోకి చొరబడే అవకాశము కూడ. ఉండదు.

నమస్కారం అన్నది సత్యగునమైనది .

అవకాశం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తికి మంచి మనస్సుతో చేతులు జోడించి నమస్కంరించడం మంచిది. నమస్కారం మంచి సంస్కారం దీన్ని మనం అందరం పాటిద్దాం.ఎదుటవారికి నమస్కరించటంతో మన విలువ పెరుగుతుంది.ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ,మన భావితరాల వారికి నేర్పిద్దాం.సత్సంబంధాలను పెంపొందించుకుందాం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Namaskar is a sattva predominant impression on the Hindu mind, an action that maintains the rich heritage of Hindu culture. Namaskar is a simple and beautiful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more