2018 సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి "ప్రేమ"ఫలితాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

గమనిక:- ఈ ద్వాదశ రాశుల వారికి "ప్రేమ" ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. ప్రేమకు సంబంధించి అంశాలు వ్యక్తి గత జాతకంలో 2,7,9,11 స్థానాలను మరియు శుక్ర,కుజుల స్థితి మరియు ఇతర ముఖ్య గ్రహాల స్థానాలు,వారి యుతులు,పరివర్తన స్థితి, దృష్తులు,ఉచ్చ,నీచ స్థానాలు,ప్రస్తుతం నడుస్తున్న మహర్ధశ,అంతర్ దశ,అష్టక వర్గు బిందువులు,నవాంశ గ్రహా స్థితులతో పాటు ముఖ్యంగా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుని "ప్రేమ"కు సంబంధించిన ఫలితాలను నిర్ణయించాల్సి ఉంటుంది.కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ వ్యక్తిగత జాతకపరిశీలతో పూర్తి "ప్రేమ"వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

మేషరాశి

మేషరాశి

మేషరాశి వారికి 2018 సంవత్సరంలో "ప్రేమ" ఫలాలు:- అష్టమ స్థానంలో గురు గ్రహ సంచారం,శని తొమ్మిదవ ఇంట్లో,సప్తమ,దశమంలో కేతువు,నాలుగవ ఇంట రాహూవు సంచారం వలన భావించడం వల్లన ప్రేమ వ్యవహారం గందరగోళంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.మీ ప్రేమ వన్ సైడ్ లవ్ ను తలపిస్తున్నట్లు ఉంటుంది.పెద్దలను ఒప్పించడానికి బయపడాల్సిన స్థితి వస్తుంది.మీ మాటలు,ప్రవత్తనలో కఠువు,మొండి తనం లేకుండా శాంతగా వ్యవహరించ గలుగుతే అనుకున్నది సాధించగలరు వైవాహిక జీవితంలో జీవితంలో ఎక్కువ మీ జీవిత భాగస్వామిని ఆకర్శించుకునే కార్యక్రమాలు చేయాలి.

 వృషభరాశి

వృషభరాశి

వృషభరాశి వారికి 2018 సంవత్సరంలో "ప్రేమ"ఫలాలు:-షష్టమ సప్తమ స్థానాలలో గురు గ్రహా సంచారం,అష్టమంలో శని సంచారం తొమ్మిదవ ఇంట కేతువు,మూడవ ఇంట్లో రాహువు సంచారం వలనఈ సంవత్సరం మీ ప్రేమబంధాలతో వివాదాలు మరియు తగాదాలకు దూరంగా ఉండాలి.ముఖ్యంగా మొదటి రెండు నెలలకాలంలో ప్రేమలో వివాదాలకు దూరంగా ఉండండి, పంతాలు వద్దు, మొండి, మీ ఏకాధిపత్య వ్యవహారం వలన ప్రేమకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు సంధించిన సవాళ్లను,సమస్యలను ఎదుర్కొవాల్సిన స్థితి గోచరిస్తుంది జాగ్రత్తలు పాటించండి.మీ వైవాహిక జీవితం మీ ఆధి పత్యధోరని వలన కుటుంబంలో స్వల్ప మనస్పర్ధతలు చోటు చేసుకుంటాయి.

మిధునరాశి

మిధునరాశి

మిధునరాశి వారికి 2018 సంవత్సరంలో "ప్రేమ"ఫలాలు:- సప్తమంలో శని గ్రహం,అష్టమంలో కేతువు,ద్వితీయంలో రాహువు, షష్టమంలో గురు గ్రహ సంచారం వలన ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు మీ మాట తీరును,ప్రవర్తనను మార్చుకోవాలి లేనిచో మీ ప్రేమ గొడవలకు దారితీయవచ్చు.కుటుంబంలో మన:శాంతికి కరువైనట్లు వ్యవహారమ్ ఉంటుంది.మీ స్వభావం మొండి వైకరి వలన మీరు ప్రేమించిన వారిని దూరం చేయకునే అవకాశాలు ఉన్నాయి.మీ వ్యక్తి గత జాతకంలో సప్తమ స్థాన స్థితి మహాదశ ప్రకారంగా వివాహం యోగం మీరు కోరుకున్న భాగస్వామితో గురువు సప్తమ,వివాహ స్థానాలకు సంబంధం పొంది ఉంటే పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు.

కర్కాటక

కర్కాటక

కర్కాటక వారికి 2018 సంవత్సరంలో "ప్రేమ"ఫలాలు:- షష్టమంలో శని,చతుర్ధ పంచమాలలో గురువు,లగ్నంలో రాహువు,సప్తమంలో కేతుగ్రహ సంచారం వలన మీరు బాగా ఇష్టపడి ప్రేమించేవారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వలన మీ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణం అయ్యె అవకాశాలు ఉన్నాయి.చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికి కూడా ప్రేమ జీవితం మీ స్వభావాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి.మీ ప్రేమ జీవితం సజావుగా సాగడం కొరకు మీరు ఆధిపత్యం చేయక, వాదనలకు దూరంగా ఉండాలి.ఈ ఏడాది కొన్నిసవాళ్లతో ప్రేమ జీవితం ఉంటుంది.

సింహరాశి

సింహరాశి

సింహరాశి వారికి 2018 సంవత్సర "ప్రేమ"ఫలాలు:- పంచమంలో శనిగ్రహం,త్రుతీయ చతుర్ధ స్థానలలో గురువు,షష్టమంలో కేతువు,వ్యయంలో రాహుగ్రహ సంచారం వలన మీ ప్రేమ జీవితం మిశ్రమ ఫలితాలతో నడుస్తుంది. మీ ప్రేమలో కొన్ని అనవసరమైన అపార్ధాలతో మీరుంటారు, మిమ్మల్ని అమితంగా ఇష్టపడే వారిని అర్ధం చేసుకోక మీ ప్రేమ జీవితం కాలాన్ని వృధా చేస్తారు.నిజానికి మీకు నిజమైన ప్రేమ విలువ తెలువదు, తెలుసుకోక మనస్సులో కోరికలు ఉన్నా,కొన్ని పట్టింపుల వలన,బద్ధకం వలన కాలయాపనను చేయిస్తారు,ప్రేమను వదలరు అలా అని గట్టిగా నిలబడరు.ప్రేమించడం కంటే ప్రేమించబడడం గోప్ప,మీరు చేస్తున్న పొరపాట్లు గ్రహించి మీ ప్రేమను ధైర్యంగా మీరంటే అమితంగా ఇష్టపడే వారితో మీ మనస్సులోని విషయాలను వ్యక్త పరుస్తే మీ ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది.

కన్యారాశి

కన్యారాశి

కన్యారాశి వారికి 2018 సంవత్సర "ప్రేమ"ఫలాలు:- చతుర్ధ స్థానంలో శనిగ్రహం,ద్వితీయ త్రుతీయ స్థానంలో గురువు,పంచమంలోకేతువు,ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ప్రేమించిన వారితో చక్కటి సమయాన్ని గడుపుతారు.ప్రేమ వలన విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది,చదువును,లక్ష్యన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్ధించడం వలన ఇబ్బందులు,అప్రధిష్టలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త పడండి.ప్రేమ గోప్పదే కాని గుడ్డి ప్రేమ మంచిది కాదు.మీ ప్రేమ భాగస్వామి ద్వారా మీ లక్ష్యలలో కొంత సహకారం పొందుతారు.జీవిత భాగస్వామి నుండి మీరు పూర్తి మద్దతును పొందుతారు.ప్రేమ జీవితంలో శాంతిసామరస్యాలను పాటించడం మరియు వాదోప వాదలకు దూరంగా ఉండాలి.కొత్త కొత్త పరిచయాలు,ఆకర్షణలు పెరుగుతాయు,కాని సమాజం మిమ్మల్ని గమనిస్తుంది అని మరవవద్దు.

తులారాశి

తులారాశి

తులారాశి వారికి 2018 సంవత్సర "ప్రేమ"ఫలాలు:- తృతీయంలో శని గ్రహం,లగ్న ద్వితీయంలో గురు గ్రహం,చతుర్ధంలో కేతువు,దశమంలో రాహు గ్రహ సంచారం వలన ప్రేమ జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడం కొరకు శాంత స్వభావాన్ని అలవాటు చేసుకోవల్సి ఉంటుంది. మాట్లాడే ముందు జాగ్రత్త వహించండి.మీ కఠిన పదజాలం,ప్రవర్తనల వలన మన:స్పర్థతలు కలిగే అవకాశం ఉంది. ప్రేమలో ఒంటరిగా ఉన్న భావన కలగడం వల్ల మీరు కుటుంబజీవితంలో సుఖసంతోషాలను పొందలేకపోతారు.ప్రేమ జీవితానికి మీరు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతారు.దీనిపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది.మార్చి తరువాత ప్రేమ జీవితంలో పురోగతి ఉంటుంది.విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి 2018 సంవత్సర "ప్రేమ"ఫలాలు:- ద్వితీయంలో శని గ్రహం,వ్యయంలో గురు గ్రహం,తృతీయంలో కేతువు, తొమ్మిదవ ఇంట్లో రాహుగ్రహ సంచారం వలన మీ ప్రేమ జీవితంలో అక్టోబర్ తర్వాత మంచి ఫలితాలు కనబడుతాయి. ప్రేమ భాగస్వామి మీ జీవితంలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది.కుటుంబంలో పెద్దలతో ఇబ్బందులు మీపై అజామాయిషిలు ఉంటాయి.ఆకర్షణలకు,ప్రలోభాలకు అవకాశం ఇవ్వకూడదు.విద్యార్ధి ప్రేమికులు చదువుపై అధిక శ్రద్ధ చూపకపోతే విధ్యలో అపజయం కలుగుతుంది.ఏలినాటి శని ప్రభావం వలన మీప్రేమ రహస్యం బయట పడుతుంది,అనవసరమైన నిందలు కూడా ఎర్పడతాయి కావున తోందర పాటు ,తప్పుడు నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దు.మొత్తం మీద మిశ్రమ ప్రేమ ఫలితాలు చూస్తారు.

ధనుస్సు

ధనుస్సు

ధనుస్సు వారికి 2018 సంవత్సర "ప్రేమ"ఫలాలు:- లగ్నంలో శని గ్రహం,ఏకాదశ,వ్యయస్థానలలో గురు గ్రహం,ద్వితీయంలో కేతువు,అష్టమంలో రాహుగ్రహ సంచారం వలన ప్రేమ జీవితం వలన కొంత మానసిక బలం కలుగుతుంది.కాని మీ ప్రేమ వ్యవహారానికి సంభంధించి కుటుంబ,ఆత్మీయులతో కఠిన మాటల ప్రయోగం మానండి ,బందు,మిత్రులతో విరోధం లేకుండా జాగ్రత్త వహించండి.అక్టోబర్ తరువాత కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్ధి ప్రేమికులు ప్రేమ కంటే లక్ష్యం గొప్పదని భావించి కష్టపడి చదువుతారు, చదువుల్లో రాణిస్తారు.మీ ప్రేమ విషయాల గురించి కుటుంబంలో అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికి కూడా మీ ప్రేమ జీవితం సామరస్యంగా సాగుతుంది. కోందరికి మాత్రం శని ప్రభావంచేత వారి వ్యక్తిగత జాతకం ఆధారంగా ప్రేమలో ఒంటరిగా ఉండటం లేదా కుటుంబ జీవితం నుంచి దూరంగా ఉన్న భావన కలుగుతుంది.

మకరరాశి

మకరరాశి

మకరరాశి వారికి 2018 సంవత్సర "ప్రేమ" ఫలాలు:- వ్యయస్థానంలో శనిగ్రహం,దశమ,ఏకాదశంలో గురుగ్రహం,సప్తమంలో రాహువు,లగ్నంలో కేతుగ్రహ సంచారం వలన మీరు జీవితంలో ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమలో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రేమ జీవితంలో అభిప్రాయాలు బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. అక్టోబర్ నెల తర్వాత మీ మీ ప్రేమ జీవితం మెరుగు పడుతుంది.మీ వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మూలాన అభిప్రాయభేదాలు ఏర్పడతాయి.ప్రేమలో మీ దురుసు తనం ,మొండి తనం వలన కొంత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.స్వంత నిర్ణయాలను ఆత్మీయులతో సలహాలు తీసుకోని ముందుకు వెలితే మీ ప్రేమ ఫలిస్తుంది.

కుంభరాశి

కుంభరాశి

కుంభరాశి వారికి 2018 సంవత్సర "ప్రేమ"ఫలాలు:- ఏకాదశ స్థానంలో శని గ్రహం,నవమ-దశమ స్థానంలో గురువు,షష్టమ స్థానంలో రాహువు,వ్యయ స్థానంలో కేతు గ్రహ సంచారం వలన ప్రేమలో మంచి నిర్ణయాల వలన జయం కలుగుతుంది. ప్రేమకు మూలం మీ ప్రతిభ కారణం అవుతుంది. ప్రేమలో మొదటి రెండు నెలలు కొన్ని కుటుంబ సమస్యలతో కూడి ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామి ఆరోగ్య సమస్య లేదా కొన్ని వివాదాలతో ఇబ్బందులు పడవచ్చును. మీ ప్రేమలో మీ అభిప్రాయాలతో ఒప్పించుటకు కృషి చేయాల్సి ఉంటుంది, ప్రేమలో మీరు ఒకరి నొకరిని మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రేమ మీరనుకున్న అనుభూతులు పొందడానికి దోహదపడతాయి.మొత్తం మీద ఈ ఏడాది ప్రేమ సంవత్సరంగా నిలుస్తుంది.

మీనరాశి

మీనరాశి

మీనరాశి వారికి 2018 సంవత్సర "ప్రేమ"ఫలాలు:- దశమస్థానంలో శనిగ్రహం,అష్టమ,నవమ స్థానంలో గురువు,ఏకాదశ స్థానంలో కేతువు,పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ప్రేమలో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి.ప్రేమను సాధించాలన్న మీ తపన అక్టోబర్ వరకు ఫలించదు,ఆ తరువాత చక్కటి ప్రేమ జీవితాన్ని ఆస్వాదించ గలుగుతారు. ఇతర వ్యవహార ఒత్తిడి వలన సమయం దొరకక పోవడం వలన ప్రేమ జీవితంలో మీకు సమస్యలు కలగవచ్చు.ప్రేమలో అనుకున్న ఫలితాలను పొందడం కొరకు మీరు అదనంగా సమయాన్ని కేటాయిస్తారు.కుటుంబ పెద్దలు మీ పై అజమాయిషి చేస్తారు.మీ జాతకంలో ప్రేమకు సంబంధించిన గ్రహాలు స్థానాలు అనుకులంగా ఊంటే మీ ప్రేమ జీవితం చక్కగా సాగిపోతుంది.జీవిత భాగస్వామి మీ యొక్క అన్ని ప్రయత్నాలకు చక్కగా సహకరిస్తారు.అక్టోబర్ తరువాత మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనపడే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
2018 predictions: Love horoscope

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి