Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పదేళ్లకు పైగా ముఖ్యమంత్రి-సొంత ఇల్లు-వాహనం లేదు : మమతా ఆస్తులు ఎంతో తెలుసా..!!

కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి పశ్చిమ బెంగాల్ లో మమతా ముఖ్యమంత్రి అయి పదేళ్లు అయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఆస్తులు ఏ స్థాయిలో పెరిగి ఉంటాయనేది సహజంగా అందరిలోనూ ఆసక్తి కరమే. కానీ, దీనికి పూర్తి భిన్నంగా మమత శైలి కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో సవాల్ గా తీసుకొని నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా ఓడిపోయారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో..ఇప్పుడు ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక ల్లో భవానీపూర్‌ నుంచి టీఎంసీ అధినేత్రి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో దీదీ గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. ఈ నామినేషన్ పత్రాల్లో మమతా తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఇందులో తనకు సొంత ఇల్లు, వాహనం లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం 2019-20లో ఉన్నదానికంటే పెరిగిందని దీదీ తెలిపారు.

Mamata Banerjee doesnt own any vehicle or property, according to the affidavit

ఈ ఏడాది మేలో ముగిసిన 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసినప్పుడు మమతా బెనర్జీ ప్రకటించిన ఆదాయం.. తాజాగా మమతా దాఖలు చేసిన తాజా అఫిడవిట్ ప్రకారం దేదీ ఆదాయం రూ .5 లక్షలు పెరిగింది. 2019- 20 ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ప్రకటించిన ఆదాయం రూ. 10,34,370. అయితే తాజాగా 2020-21లో ప్రకటించిన ఆదాయం రూ .16,47,845లు దీంతో ఈ ఐదు నెలల్లో దీదీ ఆదాయం ఐదులక్షల రూపాయల మేర పెరిగింది.

ఇక 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్‌తో దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. మమతా బెనర్జీ ఆదాయం రూ .8,18,300.. అయితే 2019-20లో ఆదాయం గణనీయంగా రూ .20,71,010 కి పెరిగింది. ఇక మమత బెనర్జీ బ్యాంక్​ బ్యాలెన్స్​ ప్రస్తుతం రూ.13,11,512గా ఉన్నదని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. నందిగ్రామ్ ఎన్నికల సమయంలో మమత బ్యాంక్ బ్యాలెన్స్ 13,53,000గా చూపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ రూ.27,61,000గా ఉన్నట్లు తెలిపారు.

Recommended Video

    Pegasus: Mamata Banerjee VS PM Modi - 'Khela Hobe' | 2024 General Elections | Oneindia Telugu

    అయితే ప్రస్తుతం తన వద్ద రూ.69,255 నగదు ఉన్నట్లుగా మమత పేర్కొన్నారు. ఇక 9.7 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని, ఏ బ్యాంకులో అప్పు లేదని పేర్కొన్నారు. ఈ ఆస్తులతో పాటు దీదీ వద్ద 9.7 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆమెకు ఏ బ్యాంకు నుంచి అప్పులు లేవు.కాగా భవానీపూర్‌లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్‌ చేసింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్‌. దీంతో ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+