శంతన్‌కుమార్‌కు ప్రాణహాని లేదు: డాక్టర్లు
విజయవాడ: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి చలపతిరావు కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు వంగవీటి శంతన్ కుమార్ ఆరోగ్య స్ధితి నిలకడగా ఉందని, మరో 48 గంటల సేపు ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంటారని డాక్టర్లు శనివారం ఉదయం తెలిపారు. శంతన్‌కుమార్‌పై ప్రత్యర్ధులు శుక్రవారం మధ్యాహ్నం కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడిలో శంతన్ అనుచరుడు, కెసిపి షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగి శీలంరాజు వరప్రసాద్ అక్కడికక్కడే మరణించారు. వంగవీటి శంతన్‌పై హత్యా యత్నం కేసు దర్యాప్తునకు ఐదు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటి వరకు 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు కాట్రగడ్డ బాబు తదితరులు పరారీలో ఉన్నారు. శంతన్ కుమార్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దివంగత వంగవీటి మోహన్ రంగా అన్న కుమారుడు. రంగా కుమారుడు రాధాకృష్ణ ప్రస్తుతం విజయవాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications