హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ గొప్పతనం కాదు: కెసిఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైనా స్వతంత్రంగా ఏమైనా చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తమ పంథా, ప్రస్థానం తమకున్నదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక్క ఎదురుదెబ్బతో గిలగిలలాడబోమని, ఇంకా కరుకుగా, మొండిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. తెరాస శాసనమండలి సభ్యుడు కపిలవాయి దిలీప్‌ కుమార్‌ కు ప్రజాస్వామ్య విలువలపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా పార్టీ ద్వారా వచ్చిన పదవులను వదిలిపెట్టాలన్నారు. దిలీప్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామంటే తెరాస అడ్డుకోబోదని చెప్పారు. దిలీప్‌కుమార్‌ తన శాసనమండలి సభ్యత్వం రద్దు కాదని ప్రచారం చేసుకుంటున్నారని, కానీ దిలీప్ ను మండలిలో తెరాస ఫ్లోర్‌ లీడర్‌ గా గుర్తించాలని తానే లేఖ ఇచ్చానని కెసిఆర్ తెలిపారు. ఎన్నికల్లో తెరాస బీఫారం కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. తెరాస చేపట్టిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తన తల తెగిపోయినా ఆగదని ఆయన అన్నారు. మున్ముందు ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై దృష్టి పెడతామని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ వీసాపైనే తెలంగాణలో ఉన్నాడని, వైయస్ వీసా రద్దు చేయించే వరకు ఉద్యమ కార్యక్రమాలు ఆగవన్నారు. ప్రతి రోజు ఆదివారం కాదని సోమవారం కూడా ఉంటుందన్న ఆంగ్ల సామెతను వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి కెసిఆర్ ప్రస్తావించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు యాదృచ్ఛికమేనని, ఆ పార్టీ గొప్పతనమేమీ లేదన్నారు. ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతోనే కాంగ్రెస్‌ బయటపడిందన్నారు.

పటేల్‌ సుధాకర్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తెరాస ఖండించింది. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నది సమస్యలను పరిష్కరించదని కెసిఆర్ చెప్పారు. మావోయిస్టుల సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు అనాగరికమని, అశాస్త్రీయమని, ఆటవికమని అభివర్ణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X