న్యూఢిల్లీ: మైనింగ్ వ్యవహారాలలో అనవసరంగా ఎంపి జగన్మోహన రెడ్డి పేరును తీసుకురాకండని ముఖ్యమంత్రి కె.రోశయ్య జాతీయ మీడియాని కోరారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లడారు. రాష్ట్ర రాజకీయాలలో జగన్ క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉందన్నారు. జాతీయ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సిఎం సమాధానాలు చెప్పారు.
ఓబుళాపురం గనుల కుంభకోణంలో వైఎస్ కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక బిజెపి నాయకుడైన గాలి జనార్ధనరెడ్డితో జగన్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని మీడియా ఆధారాలతో సహా కథనాలను ప్రచురించింది.