మోహన్ బాబు 'రాజోలీ'

గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ తమకు చేసింది ఏమీ లేదని గ్రామ ప్రజలు చెప్పారు. వరదలకు గురైన తమకు చాలా మంది సాయం చేశారని, వారందరి మాదిరిగానే మోహన్ బాబు కుమారులు తమకు సహాయం చేశారని వారు తెలిపారు. కొన్ని దప్పట్లు పంచారని వారన్నారు. అంతకు మించి తమకు చేసిందేమీ లేదని వారన్నారు. ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు, బియ్యం ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని వారు చెప్పారు. దాదాపు 25 మంది తమకు సహాయం చేశారని, వారి లాగానే మనోజ్, విష్ణువర్ధన్ సహాయం చేశారని వారు చెప్పారు. తమకు ఆత్మాభిమానం ఉందని, ఆ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే విధంగా మోహన్ బాబు వ్యవహరించడం సరి కాదని వారంటున్నారు.
సమైక్యవాదంతో మోహన్ బాబు ఒక్క రోజు తిరుపతిలో రిలే నిరాహార దీక్ష చేశారు. విజయవాడలో దీక్షలు చేస్తున్న తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులను పరామర్శించారు. దీంతో ఆగ్రహం చెందిన తెలంగాణవాదులు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమారుడి చిత్ర షూటింగ్ ను అడ్డుకున్నారు. మర్నాడు ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ షూటింగ్ ను కూడా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన మోహన్ బాబు తెలంగాణ ఆందోళనకారులపై, తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రాపుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సవాళ్లు విసిరారు. తాను రాజోలీ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, విద్యా సంస్థల ద్వారా సేవలు చేస్తున్నానని చెప్పుకున్నారు. ఈ స్థితిలోనే జీ 24 గంటల న్యూస్ రాజోలీ గ్రామ ప్రజలతో మాట్లాడింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications