• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిత్యానంద స్వామి ఖాతాలో మరికొందరు హీరోయిన్లు!

By Santaram
|

Nityananda Swami
చెన్నై: నిత్యానందస్వామికి సొంత ఊరు అయిన తిరువణ్ణామలై లో మంచి పేరు లేదు. తిరువణ్ణామలైలో 1978లో జన్మించిన నిత్యానందుడు అలియాస్‌ రాజశేఖరన్‌ 12వ ఏటే బ్రహ్మచర్యంతో ముక్తిమార్గం వైపునకు నడిచాడు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిని తన గురువులుగా చెప్పుకునే రాజశేఖరన్‌ కు హిమగిరుల్లో ఓ ఆథ్మాత్మిక గురువు నిత్యానంద పరమ హంసగా నామకరణం చేసినట్లు సమాచారం. నిత్యానంద స్వామిగా పేరు మార్చుకున్న రాజశేఖరన్‌ అతి తక్కువ వ్యవధిలో తన వాక్‌ చాతుర్యం, ప్రవచనాలు, ముక్తి బోధనల ద్వారా దేశ, విదేశాల్లో భక్తులను కూడగట్టుకున్నారు. తొలుత ఈరోడ్‌లోని కావేరి తీరంలో ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కర్ణాటకకు మకాం మార్చారు. బెంగళూరు సమీపంలోని మైసూర్‌ రోడ్‌లో 1,300 ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. తన స్వగ్రామం తిరువణ్ణామలైలో అతి పెద్ద ఆశ్రమం ఏర్పాటుకు శతవిధా లా యత్నాలు చేశారు.

అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు మూడు ఎకరాల విస్తీర్ణంలో గిరివలయం రోడ్డులో ధ్యాన పీఠాన్ని ఏర్పాటు చేశారు. తన విలాసవంతమైన జీవితం కోసం ఇక్కడ సుందర భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 33 దేశాల్లో 1,200కు పైగా ఆశ్రమాలను, ధ్యాన పీఠాలను, సేవా కేం ద్రాలను ఏర్పాటు చేశారు. అనేకమంది శిష్యగణాన్ని కూడగట్టుకుని ఆథ్మాత్మిక శిక్షణ ఇస్తూ వచ్చిన నిత్యానందుడు నిత్యం విలాసాల్లో తేలియాడుతూ వచ్చారు. జనవరి ఎనిమిదో తేదీన ఈ పీఠంలో ఆయన జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. తాజాగా తమిళ నటి రంజితతో ఆయన చేసిన వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఇవి రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. ఆయనపై విశ్వాసం కలిగి ఉన్న భక్తులు టీవీలో ఆ దృశ్యాలను చూసి జీర్ణించుకోలేకపోయారు. మరి కొంతమంది ఆయన ఆశ్రమాలపై దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదిలావుండగా దేశ విదేశాల్లో తిరుగుతూ ప్రవచనాలు చేసే నిత్యానందుడు అత్యధికంగా సినీ నటీమణులతోనే స్నేహం చేస్తున్నట్లు బయటపడింది. ఆశ్రమానికి కళంకం తీసుకురాని విధంగా ప్రవచనాల పేరుతో ఆయన తన చీకటి కార్యకలాపాలను సదరు నటీమణుల ఇళ్లలోనే సాగిస్తున్నట్లు సమాచారం.

అందుకు నిదర్శనం తాజాగా వెలుగుచూసిన వీడియో క్లిపింగ్‌లే. సదరు తమిళ నటి సన్నిహితులు అనారోగ్యంతో ఆశ్రమంలో చేరారు. వారికోసం ఆమె అక్కడికి వెళుతూ నిత్యానందుడితో పరిచయం పెంచుకున్నారు. ఆమెతో పాటు మరికొందరు కోలీవుడ్‌ నటీమణులతో నిత్యానందుడికి సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తుండడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో నిత్యానందుడు ఇటీవల రాసలీలలు సాగిస్తూ పట్టుబడిన తురువరం ప్రేమానంద చతుర్వేద స్వామి, ఢిల్లీ త్రివేది స్వామి, సురుటు స్వామిజీల జాబితాలోకి చేరిపోయారు. వరుసగా వెలుగుచూస్తున్న స్వామిజీల శృంగార ఘట్టాలను బట్టి చూస్తే దేశంలో ఏ మేరకు దొంగ స్వాములు ఉన్నారో స్పష్టమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X