హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా ఉపసంహరించుకున్న జస్టిస్ నాగార్జున రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Nagarjuna Reddy
హైదరాబాద్:ఎట్టకేలకు జస్టిస్ నాగార్జునరెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిసార్ అహ్మద్ కక్రూతో నాగార్జునరెడ్డి సుమారు 4గంటలపాటు సమావేశమై అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.అనంతరం ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ప్రధాన న్యాయమూర్తితోపాటు, రాష్ట్రపతికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకున్నట్టు చెప్పారు.శుక్రవారం హైకోర్టు పనులు సజావుగా సాగటంతో ప్రతిష్ట పునరుద్ధరణపై ఆశలు చిగురించినట్టు ఆయన చెప్పారు. ఈ వ్యవస్థలో కోల్పోతున్న విలువలను తప్పుపట్టి తప్పు కోవటం కంటే దానినుంచి సమాజాన్ని దూరం చేయటానికి కొనసాగడానికే నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

హైకోర్టు సంఘటనల నేపథ్యంలో రాజీనామా చేసినట్టు 16న రాజీనామా చేసిన ఆయన చేశారు. ఆ తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కక్రూ రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. గత 4 రోజులుగా కోర్టులో జరుగుతున్న సంఘటనలు తనను బాధ పెట్టాయని, ఇవి న్యాయాన్ని రక్షింటచాల్సిన కోర్టులోనే జరగడం తనను మనోవ్యధకు గురి చేశాయన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు సైతం విలువలు తగ్గిపోయేలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X