వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ఒక్కడి వల్లనే కాకపోవడం వల్లనే కాంగ్రెసులో విలీనం: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: తన ఒక్కడితో సాధ్యం కాని సామాజిక న్యాయాన్ని మరొక బలమైన శక్తితో చేతులు కలపడం ద్వారా సాధించవచ్చనే ఉద్దేశంతోనే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ఆదివారం సాయంత్రం సోనియాగాంధీతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజలకు ఉత్తమసేవలు అందించడానికి మరో బలం తోడయితే బాగుంటుందని పార్టీలో తీర్మానించి నిర్ణయాధికారం తనకు అప్పగించారని, ఆ మేరకు కాంగ్రెస్‌తో విలీనం అవ్వాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన చెప్పారు. ఎప్పుడు విలీనం చేయాలి, ఎలా చేయాలి, దానికి రాజ్యాంగపరమైన విధానాలు ఎలా పూర్తి చేయాలన్నది సమీప భవిష్యత్తులో నిర్ణయించుకుంటామని చిరంజీవి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

పార్టీని నడపలేకే కాంగ్రెస్‌లో విలీనం చేశారన్న వాదనలకు ఏమని సమాధానమిస్తారని అడగ్గా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఏదైనా చేస్తానని, తాము ఎక్కడకు వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని, అస్సలు డబ్బు సమస్యకానీ, డబ్బు అవసరంకానీ లేని ఏకైక పార్టీ తమదేనని ఆయన జవాబిచ్చారు. కాంగ్రెస్‌లో తప్పు జరిగితే ఇప్పుడు కూడా విమర్శిస్తారా అని ప్రశ్నిస్తే - కచ్చితంగా. సోనియాగాంధీ నాయకత్వంపై నమ్మకం ఉందని, తప్పు జరిగితే ఉపేక్షించే తత్వం ఆమెకు లేదని, అందుకు ఆదర్శ్‌ కుంభకోణంపై చర్యలే ఉదాహరణ అని ఆయన జవాబిచ్చారు.

2004-2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో దేశ చరిత్రలో ఎన్నడూలేనంత భారీ అవినీతి జరిగిందని, అది వైయస్సార్ ప్రభుత్వంలో చోటు చేసుకొందని, ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో కుంభకోణాలు జరిగాయని, వైయస్సార్ చనిపోయిన తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాల్లో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని, వారు ఉత్తమ పాలన అందిస్తున్నారని, కొందరి వ్యక్తుల వల్లే ఇలాంటి అవినీతి జరుగుతుందని, ఇప్పుడు కచ్చితంగా ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రజలకు సేవలందించి వారితో శభాష్‌ అనిపించుకొని వారి మనసులో నెంబర్‌ వన్‌ స్థానం సంపాదిస్తానని ఆయన దీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో చేరుతారా అని అడిగితేమాకోసం మేమేమీ ఆశించడంలేదు. ప్రజలకు అత్యుత్తమ సేవలు ఎలా చేయాలన్నదే మా లక్ష్యం. వాళ్లు పదవుల కోసం ఎదురుచూడటంలేదని ఆయన జవాబిచ్చారు.

తాము మంత్రివర్గంలో చేరే అవకాశం లేదని, రాష్ట్రంలో, కేంద్రంలో పదవులు స్వీకరించాలని, వారు ఇస్తారని ఆశించడం లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కే తాను కట్టుబడి ఉంటానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని,త అయితే శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ జగన్‌ వర్సెస్‌ చిరుగానే ఉంటుందా అని అఆడిగితేఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. ఏ స్థాయిలో ఉంటారో చెప్పడం కష్టమని, రాజకీయాలు నిరంతరం మారుతుంటాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X