హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రయాణంలో పదనిసలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Prajarajyam
హైదరాబాద్: భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ ప్రయాణంలో కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. పార్టీ అనేక ఒడిదొడుకులకు గురైంది. ఆ సంఘటనలు ఇలా ఉన్నాయి

2008, ఆగస్టు 17: రాజకీయాల్లోకి వస్తున్నట్లు హైదరాబాద్‌లో చిరంజీవి ప్రకటన.

2008 ఆగస్టు 26: తిరుపతిలో పార్టీ ఆవిర్భావ సభ. పార్టీ పేరు, జెండా, విధివిధానాలు వెల్లడి.

2008 అక్టోబర్‌ 10: శ్రీకాకుళం అరసవల్లి సూర్యదేవాలయంలో పూజచేసి 'ప్రజా అంకిత యాత్ర' ప్రారంభం. ఈ సందర్భంగా ''గద్దెనెక్కిన తర్వాత నాయకులు గద్దల్లా మారుతున్నారు. ప్రజల కష్టాలు విస్మరించి, తమ అవసరాలు తీరితే చాలనుకుంటున్నారు. ప్రజాక్షేమాన్ని మరిచారు. రాజకీయ అవినీతిపై యుద్దభేరి మోగిస్తున్నాను'' అని ప్రకటించారు.

2008 అక్టోబర్‌ 30: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల నుంచి తెలంగాణలో ప్రజా అంకితయాత్ర ప్రారంభం.

2008 అక్టోబర్‌ 31: కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో 'సామాజిక తెలంగాణ'కు కట్టుబడి ఉంటాను.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజల ఆత్మగౌరవ సమస్య అని వెల్లడి. శాసనసభ ఎన్నికల్లో పాలకొల్లు, తిరుపతి నుంచి చిరంజీవి పోటీ. పాలకొల్లులో ఓటమి. ఎన్నికల్లో ప్రరాపాకు 17 శాతం ఓట్లు.

2009 నవంబర్‌ 11: విలీనానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నా మేం సిద్ధంగా లేం. ఆ పార్టీతో మెత్తగా, స్నేహంగా ఉండే అవకాశమే లేదని స్పష్టీకరణ.

2009 డిసెంబర్‌ 10: ప్రజాభిష్టం మేరకే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటన.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్‌ నుంచి చిరంజీవికి ఆహ్వానం. సోనియాగాంధీతో భేటీ.

2010 జూన్‌ 1: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రజారాజ్యం తీర్మానం.

2010 జూన్‌ 7: కాంగ్రెస్‌తో పొత్తుకు అభ్యంతరం లేదని ప్రకటన.

2010 జూన్‌ 25: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమని ప్రకటన.

2010 అక్టోబర్‌ 25: విశాఖలో ప్రరాపా ప్లీనరి. కాంగ్రెస్‌లో విలీనం ప్రసక్తే లేదని స్పష్టీకరణ.

2011 జనవరి 31: కాంగ్రెస్‌ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ ఢిల్లీ నుంచి పార్టీ దూతగా హైదరాబాద్‌ రాక. చిరంజీవితో భేటీ. ఢిల్లీకి రావాలని పిలుపు.

2011 ఫిబ్రవరి 6: ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి అధికారిక ప్రకటన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X