చంద్రబాబు వద్దకు మంత్రి సుదర్శన్: కృష్ణ ట్రిబ్యునల్ చర్చకు పట్టు

సమావేశాలు సాఫీగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా తీర్పుపై ప్రభుత్వం తీరు సరిగా లేదని, భారీగా నీరు పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తేనే కృష్ణా నీటిలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేయాలని బాబు పట్టుబట్టారు. దీనికి మంత్రి సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 22న అఖిలపక్షం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.