వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు ఎమ్మెల్యే జయసుధ తిరుగుబాటు, విప్ తిరస్కరణ

ఈ నెల 16వ తేదీన సినిమా షూటింగ్ ఉన్నందున తాను రాలేనని జయసుధ చెప్పారు. ఈ నెల 17వ తేదీన జరిగే వోటింగ్‌కు మాత్రం హాజరవుతానని ఆమె చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు ఆమె పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను జగన్ వెంటే ఉంటానని కూడా చాలా సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో విప్‌ను తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెసు శానససభ్యులకు విప్ ఇస్తూ వారి సంతకాలను తీసుకున్నారు. అయితే, జయసుధ మాత్రం విప్‌ను తీసుకోవడానికి నిరాకరిస్తూ సంతకం చేయలేదు. ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని, అయితే తాను 16వ తేదీన శాసనసభకు హాజరు కాలేను కాబట్టి విప్ తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే నిరాకరించానని జయసుధ చెప్పారు.
Comments
English summary
Secendurabad Congress MLA rejects to accept whip, issued during MLC election under MLA qouta to be held on March 17. She said that sje is not in a position to attend assembly on March 16, as she is having cinema shooting, so avoid embarassment she rejected whip.
Story first published: Tuesday, March 15, 2011, 12:12 [IST]