హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల ఫలితాలు చిచ్చు రేపాయి. తొమ్మిది స్థానాలకు ఎన్నికలకు జరిగితే మూడు స్థానాలు మాత్రమే గెలుకోవడంతో వట్టి వసంత కుమార్‌తో పాటు మరి కొద్ది మంది మంత్రులు మనస్థాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వదవికి రాజీనామా చేయడానికి వట్టి వసంతకుమార్ సిద్ధపడ్డారు. అయితే, సహచర మంత్రులు ఆయనను వారించినట్లు తెలుస్తోంది. వట్టి వసంతకుమార్ రాజీనామా చేస్తే మొత్తం ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుందని, అది ఆందోళనకర పరిస్థితికి దారి తీస్తుందని వారు చెబుతున్నారు.
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గిడుగు రుద్రరాజు, గంగా భావనీ అభ్యర్థిత్వాలను స్థానిక శాసనసభ్యులు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, చిత్తూరు జిల్లాలో ఓటమిపై కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కాంగ్రెసు అభ్యర్థి ఓడిపోవడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
మూడు సీట్లను వైయస్ జగన్ వర్గం అభ్యర్థులు గెలుచుకోవడం కూడా కాంగ్రెసు పార్టీలో చిచ్చుకు కారణం కావచ్చునని భావిస్తున్నారు. కడపలో ముగ్గురు మంత్రులు మోహరించి కూడా జగన్ వర్గం అభ్యర్థిని నిలువరించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
MLC Elections results affected CM Kiran Kumar Reddy's cabinet members. It is said that Minister Vatti Vasanth Kumar prepared to resign vowing responsibility for the defeat.
Story first published: Wednesday, March 23, 2011, 12:15 [IST]