అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి మహా సమాధి: క్రతువు నిర్వహించిన రత్నాకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పార్థివ శరీరాన్ని మహా సమాధి చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బుధవారం ఉదయం 8 గంటల నుండి క్రతువు ప్రారంభమయింది. బాబా సోదరుడి తనయుడు రత్నాకరరాజు క్రతువుని నిర్వహించారు. మహాక్రతువుకు అనీల్ కుమార్ వ్యాఖ్యానం చేశారు. ప్రభుత్వం తరఫున బాబాకు గౌరవ వందనం సమర్పించారు. ఆయన పార్థివ శరీరంపై జాతీయ జెండాను కప్పారు. వేదమంత్రోచ్ఛరణాల మధ్య హారతి ఇచ్చారు.

పుణ్య నదుల క్షేత్రాల మట్టిని తీసుకు వచ్చారు. సరస్వతీ నది నుండి కూడా మృత్తికను తీసుకు వచ్చారు. సాయి సమాధిని ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులో సమాధి చేశారు. బాబా శిరస్సు దక్షిణం వైపు ఉంచారు. ఈ కార్యక్రమానికి ఎల్ కె అద్వానీ, వెంకయ్యనాయుడు, యడ్యూరప్ప హాజరయ్యారు.

English summary
LK Advani, Venkaiah Naidu and BS Yeddyurappa were came to Baba Maha Samadhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X