పురంధేశ్వరికి తెలంగాణ సెగ, కాన్వాయ్‌ని అడ్డుకున్న తెలంగాణవాదులు
State
oi-Pratapreddy
By Pratap
|
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి తెలంగాణ సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామం వద్ద తెలంగాణవాదులు గురువారం పురంధేశ్వరిని అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్‌కి వారు అడ్డంగా వచ్చి ఆమెను ఆపేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. పురంధేశ్వరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పురంధేశ్వరి కాన్వాయ్‌ని తప్పించి పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రీయ విద్యాలయం కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా పురంధేశ్వరికి ఈ సంఘటన ఎదురైంది.