ప్రేమ విఫలమై ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య: ఎస్వీ హాస్టల్‌లో ఘటన
Districts
oi-Srinivas G
By Srinivas
|
తిరుపతి: చిత్తూరు జిల్లాలో ప్రేమ విఫలం కావటంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాకు చెందిన వరుణ్ అనే విద్యార్థి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఆయన విశ్వవిద్యాలయంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే గురువారం ఉదయం చూసే సరికి వరుణ్ మృతి చెందాడు. తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పూనుకున్నాడు. ప్రేమ విఫలం అయినందు వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా వరుణ్ గతంలో తన సహ విద్యార్థినిని ప్రేమించినట్లుగా తెలుస్తోంది. ఆ అమ్మాయి కూడా వరుణ్ ప్రేమించినట్లుగా తెలుస్తోంది. కొంతకాలం ఇద్దరి మధ్య ప్రేమ నడిచింది. అయితే ఇటీవల ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రేమించిన అమ్మాయి వరుణ్‌కు దూరంగా ఉంటుంది. దీంతో తీవ్ర నిరాశ చెందిన వరుణ్ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.