జివో రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు: సిఎం కిరణ్‌కు హరీష్ రావు హెచ్చరిక

ఆదివారం రోజు తెలంగాణ ఐక్య కార్యచారణ సమితి రోడ్ల పైనే వంటా వార్పుకు పిలుపునిచ్చిందని దానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. తాము కార్యక్రమాలు ద్వారా ఎవరినీ ఇబ్బందుల పాలు చేయాలని భావించడం లేదన్నారు. అందుకే వంటావార్పు కార్యక్రమాన్ని ఆదివారం పెట్టుకోవడమే కాకుండా రోడ్లకు ఇరువైపుల మాత్రమే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. డిజిపి అరవింద్ రావు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన పదవి విరమణ చేసే సమయంలో తెలంగాణవాదుల ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరించారు. ఇప్పటికే అరవింద్ రావు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాడని మరోసారి అలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు వెంటనే వారి వారి పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. అవసరమైతే తాము కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. డెడ్ లైన్లతో డ్రామాలు అడితే తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు.