హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు టిడిపి ఎంపిల రాజీనామా, కౌంట్ 121

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వారు స్పీకర్ మీరా కుమార్‌కు అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన పార్లమెంటు సభ్యుల సంఖ్య 14కు చేరుకుంది. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సంఖ్య మంగళవారం మధ్యాహ్నానికి 121కి చేరుకుంది. తాజాగా, 8 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు రాజీనామాలతో తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన శానససభ్యుల సంఖ్య 90కి చేరుకుంది. తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ దాసు రాజీనామాతో ఎమ్మెల్సీల సంఖ్య 17కు చేరుకుంది.

కాగా, తెరాస నుంచి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు శానససభ్యులు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. ఇద్దరు బిజెపి శానససభ్యులు కూడా రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. సిపిఐకి చెందిన నలుగురు శానససభ్యులు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. వీరంతా రాజీనామా చేస్తే రాజీనామా చేసిన తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 99కి చేరుకుంటుంది. తెలంగాణ నుంచి శానససభలో 119 సీట్లు ఉండగా, పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా వల్ల 118 మంది శాసనసభ్యులున్నారు.

మజ్లీస్ శాసనసభ్యులు ఏడుగురు, లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ, సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి రాజీనామా చేసే అవకాశాలు లేవు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, కాంగ్రెసు శానససభ్యులు శశిధర్ రెడ్డి, మణెమ్మ, ఆకుల రాజేందర్ రాజీనామాలు చేయలేదు. కాగా, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, దిలీప్ రాజీనామాలు చేసే అవకాశాలున్నాయి.

English summary
TDP MPS Nama Nageswara Rao and Ramesh Rathore resigned today. with this resignations the resigned Telangana MPs toll reached to 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X