వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరు అల్లుడు శిరీష్ కస్టడీ విచారణ వాయిదా

తన భర్త వేధిస్తున్నాడంటూ చిరంజీవి కూతురు శ్రీజ ఈ ఏడాది మార్చిలో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి శిరీష్ అజ్ఞాతంలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. అతను ఇటీవల కోర్టులో లొంగిపోయాడు.
శిరీష్‌భరద్వాజ్‌పై మోపిన అభియోగాలన్నింటికి సరైన సాక్ష్యాలున్నాయని, కేసులో కొన్ని అంశాలను ప్రశ్నించేందుకు అతడు అవసరమైనందున న్యాయస్థానాన్ని అభ్యర్థించామని డీసీపీ(నేరాలు) జె.సత్యనారాయణ తెలిపారు. చంచల్‌గూడ జైల్లో జుడిషియల్ కస్టడిలో ఉన్న శిరీష్‌ను అతడి తల్లి సూర్యమంగళ, బంధువు వినోద్ కలుసుకున్నారు. ఈ కేసులో సూర్యమంగళకు బెయిల్ లభించింది.