హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కస్టడీ పిటిషన్ వాయిదా, సోదరుడి పరామర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) పిటిషన్‌ విచారణ నాంపల్లి ప్రత్యేక కోర్టు గురువారానికి వాయిదా వేసింది. గాలి కస్టడీపై సాయంత్రం లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. అలాగే గాలి ఇళ్లు, కార్యాలయాల సోదాల్లో లభ్యమైన సీజ్డ్ డాక్యుమెంట్లను సైతం తమకు సమర్పించాలని ఆదేశించింది. కస్డడీకి ఇవ్వాల్సిన అవసరంపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని చెప్పింది. గాలిని పదిహేను రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆయనను అరెస్టు చేయగానే కోర్టులో ప్రవేశ పెట్టామని అందుకే ఆయనను ప్రశ్నించేందుకు తమకు అవకాశం దొరకలేదని అందుకే తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పింది. అలాగే గాలి పెట్టుకున్న బెయిలు పిటిషన్ పైనా సాయంత్రం నాలుగు గంటల లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.

కాగా గాలిని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని రిమాండ్ రిపోర్టు అసంపూర్తిగా ఉందని గాలి తరఫున న్యాయవాది కోర్టులో తెలిపారు. చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి బుధవారం వచ్చారు. భేటీ అనంతరం కాటసాని మాట్లాడుతూ గాలి తనకు బంధువని అందుకే కలిశానని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇతర విషయాల పట్ల తనకు అవగాహన లేదన్నారు. కాగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డి బుధవారం మరోసారి సిబిఐ ముందు హాజరయ్యారు. జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్ ప్రతినిధులు, సరస్వతి పవర్ ప్రతినిధులు సైతం హాజరయ్యారు. జగన్ కేసులో వాణిజ్య పన్నుల శాఖ సిబిఐకి కీలక పత్రాలు అందజేసింది.

English summary
Karnataka former minister Gali Janardhan Reddy custody petitioned postponed to tomorrow. Gali brother Karunakar Reddy met him today in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X