గాలి జనార్దన్ రెడ్డి ఇక స్పెషల్ ఖైదీ, కోర్టు ఆదేశం

తాము వ్యాపారవేత్తలం కాబట్టి తమను స్పెషల్ కెటగిరీ ఖైదీలుగా గుర్తించాలని గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దాన్ని సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. గాలి జనార్దన్ రెడ్డి ఓ సామాన్య కానిస్టేబుల్ కుమారుడని, పైగా అక్రమాలతో సొమ్ము కూడబెట్టాడని, అందువల్ల గాలి జనార్దన్ రెడ్డిని ప్రత్యేక కెటగిరీ ఖైదీగా గుర్తించకూడదని సిబిఐ వాదిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే, గాలి జనార్దన్ రెడ్డి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఇది మూడోసారి.












Click it and Unblock the Notifications