వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి కేసులో సబిత పాత్ర కీలకమైంది: శోభా హైమావతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

sobha hymavathi
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి ఓబుళాపురం గనుల వ్యవహారంలో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ విచారించాలని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి సోమవారం డిమాండ్ చేశారు. గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే సబిత ఈ కేటాయింపులు జరిపారని చెప్పారు. ప్రస్తుతం గాలి కేసులో విచారణ ఎదుర్కొంటున్న అధికారులంతా అప్పటి మంత్రుల ఒత్తిడి మేరకే ఈ విధంగా చేశామని సిబిఐ ముందు చెబుతున్నారని కాబట్టి అప్పటి కేటాయింపులపై సబితకు తెలియకుండా జరిగే అవకాశం లేదన్నారు. గాలి కేసులో సబిత కీలక పాత్ర దారిని అని ఆమెను సిబిఐ విచారించాలన్నారు.

రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన నెత్తిన వేసుకున్నారని టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి విమర్శించారు. జగన్ పార్టీకి కిరణ్‌కు అద్దెకు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విక్రయానికి సిద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి జగన్ వర్గం ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారన్నారు.

English summary
Home Minister Sabitha Indra Reddy played key role in Gali Janardhan Reddy's mining case, said TDP woman president Sobha 
 Hymavathi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X