హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో చిరు ఫస్ట్ బెంచీ భద్రం, పిఆర్పీ ఎమ్మెల్యేనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: శానససభలో గత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెసు శానససభ్యుడు చిరంజీవి ముందు వరుస బెంచీలోనే కూర్చుకుంటారు. ఆ విషయం ఖాయమైపోయింది. కాంగ్రెసులో విలీనం వల్ల తొలిసారి శాసనసభకు ఎన్నికైన సభ్యుడిగా ఆయన వెనక బెంచీకి తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయంతో ఆయన తొలి వరుస బెంచీలో కూర్చోవడానికి ఏ విధమైన ప్రమాదం వాటిల్లడం లేదు. ప్రజారాజ్యం పార్టీ విలీనం లేఖకు తనకు అందిందని, అయితే దానిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని, ఈ సమావేశాల వరకు ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులుగానే వారు కొనసాగుతారని స్పీకర్ ప్రకటించారు. దీంతో చిరంజీవి సీటుకు శాసనసభలో ఏ విధమైన డోకా లేకుండా పోయింది.

నియమనిబంధనల మేరకే తాను కొంత మంది రాజీనామాలను ఆమోదించానని నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. శానససభ్యుల సూచనలు తీసుకున్న తర్వాతనే తాను రాజీనామాలను ఆమోదించానని ఆయన చెప్పారు. విభజించు పాలించడంలో భాగంగానే రాజీనామాల ఆమోదం జరిగిందని చేసిన వ్యాఖ్యను రాజయ్య విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. అనర్హత పిటిషన్లపై నియమాలకు ప్రకారం నిర్ణయం తీసుకుంటానని, ఇది న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందని ఆయన చెప్పారు.

శానససభ భద్రతను ఎస్‌పిఎఫ్‌కు అప్పగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. త్వరలో అసెంబ్లీ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో దేశంలో తొలిసారిగా శాసనసభ్యుల ఆస్తుల వివరాలను ఉంచుతామని ఆయన అన్నారు. శాసనసభలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్ఎఫ్ఐడి కార్డుల ద్వారా శాసనసభ్యుల హాజరును నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Chiranjeevi will continue as Prajarajyam MLA for this assembly session, according to speaker Nadendla Manohar's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X