6నెలల తర్వాత సిఎం చేస్తానని హామీ ఇచ్చారు: యడ్డీ

కాగా ముఖ్యమంత్రి సదానంద గౌడపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. కాగా సదానంద గౌడ వచ్చి యడ్డీకి స్వీట్ తినిపించడం విశేషం. ఆయనను వెన్నుపోటుదారుగా అభివర్ణించారు. కాగా అప్పట్లో యడ్యూరప్ప గద్దె దిగేటప్పుడు తాను మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం గమనార్హం. అయితే తనకు అత్యంత అప్తుడైన సదానంద గౌడ పేరును యడ్డీ ముఖ్యమంత్రి పేరుకు ప్రతిపాదించారు. యడ్డీ సూచించిన వారికే అధిష్టానం పట్టం కట్టింది. అయితే యడ్డీ ఏరికోరి ప్రతిపాదించిన సదానంద గౌడ మాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం వదులుకునేందుకు ససేమీరా అంటున్నారు.












Click it and Unblock the Notifications